BigTV English

Pushpa 2 Trailer: 24 గంటల్లో రికార్డు బ్రేక్..TFI లో ఎన్నో స్థానం అంటే.?

Pushpa 2 Trailer: 24 గంటల్లో రికార్డు బ్రేక్..TFI లో ఎన్నో స్థానం అంటే.?

Pushpa 2 Trailer:పుష్ప -2(Pushpa -2).. అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా, రష్మిక మందన్న(Rashmika Mandanna)హీరోయిన్ గా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ట్రైలర్ ను ఆదివారం సాయంత్రం బీహార్ లోని పాట్నాలో రిలీజ్ చేశారు.  ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కాగా.. ఇప్పుడు ఈ ట్రైలర్ యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన ట్రైలర్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.


తెలుగులో ఆల్ టైం రికార్డ్..

పుష్ప-2 ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే.. తెలుగు ట్రైలర్ కు 44.67 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే సౌత్ ఇండియాలో అత్యధిక వ్యూస్ సాధించిన  ట్రైలర్ గా  పుష్ప-2 ట్రైలర్ నిలిచింది. అంతేకాదు హిందీ ట్రైలర్ కి 50 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇకపోతే TFI లో 8.8 లక్షల లైక్స్ తో టాప్ -7 లో నిలిచింది.


ఇప్పటివరకు తెలుగులో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమా ట్రైలర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

సర్కారు వారి పాట:

మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘సర్కారువారిపాట’ సినిమా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 27 మిలియన్ వ్యూస్ రాబట్టింది.

రాధేశ్యామ్:

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)సరికొత్త జానర్ లో తెరకెక్కించిన చిత్రం ‘రాధేశ్యామ్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఈ సినిమా ట్రైలర్ మాత్రం విడుదలైన 24 గంటల్లోనే 23.20 మిలియన్ వ్యూస్ రాబట్టింది.

బాహుబలి 2:

రాజమౌళి(Rajamouli ), ప్రభాస్ (Prabhas ) కాంబినేషన్లో వచ్చిన ‘బాహుబలి
‘సినిమా సీక్వెల్ గా ‘బాహుబలి 2’ విడుదల అయింది. ఇక ఈ సినిమా ట్రైలర్ 21.81 మిలియన్ వ్యూస్ రాబట్టింది.

ఆర్ ఆర్ ఆర్:

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్ (Ram Charan)కలిసి నటించిన చిత్రం ఇది. అంతేకాదు ఆస్కార్ అవార్డులు కూడా అందుకుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ 20.45 మిలియన్ వ్యూస్ అందుకుంది.

వకీల్ సాబ్:

బాలీవుడ్ లో వచ్చిన పింక్ చిత్రానికి రీమేక్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రీ ఎంట్రీలో చేసిన చిత్రం ‘వకీల్ సాబ్’. పవన్ కళ్యాణ్ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలైన 24 గంటల్లోనే 18.05 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు సృష్టించింది.

పుష్ప :

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో 2021లో విడుదలైన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ట్రైలర్ 15.19 మిలియన్ వ్యూస్ అందుకుంది. నిజానికి ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై పాన్ ఇండియా రికార్డులు క్రియేట్ చేసింది.

గుంటూరు కారం:

మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా 38 మిలియన్ వ్యూస్ అందుకుంది.

సలార్:

ప్రభాస్ హీరోగా నటించిన ఈ సలార్ సినిమా 24 గంటల్లోపే 32 మిలియన్ వ్యూస్ సాధించింది.

భీమ్లా నాయక్:

ప్రముఖ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2022లో విడుదల చేసిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 11.82 మిలియన్ వ్యూస్ రాబట్టింది.

ఇక ఈ రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ అల్లు అర్జున్ పుష్ప -2 తో సరికొత్త రికార్డు సృష్టించారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×