Casio Smart Ring : డిజిటల్ స్మార్ట్ వాచెస్ తయారీ సంస్థ క్యాషియో.. స్మార్ట్ రింగ్ వాచ్ ను అధునాతన ఫీచర్స్ తో తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇక గత నెలలో లాంఛ్ అయిన టైమెక్స్ గాడ్జెట్స్ తో పోలిస్తే ఇది మరింత లేటెస్ట్ అప్డేట్స్ రాబోతుందని తెలుస్తోంది.
స్మార్ట్ యుగంలో ప్రతీ గ్యాడ్జెట్ స్మార్ట్ గానే ఉండాల్సిందే. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ అండ్ స్మార్ట్ గాడ్జెట్స్ తయారీ సంస్థలు డిఫరెంట్ గాడ్జెట్స్ ను లాంఛ్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ తయారీ సంస్థలన్నీ మొబైల్స్, లాప్టాప్స్, స్మార్ట్ వాచెస్, రింగ్స్, ట్యాబ్స్ అంటూ లేటెస్ట్ గాడ్జెట్స్ లో బెస్ట్ ఫీచర్స్ ను తీసుకురాగా తాజాగా డిజిటల్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన క్యాషియో స్మార్ట్ రింగ్ వాచ్ ను తీసుకురాబోతుంది.
డిజిటల్ వాచ్ ప్రపంచంలోకి ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ క్యాషియో ప్రవేశించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందుబాటు ధరలోనే స్మార్ట్ వాచ్ రింగ్ ను తీసుకొస్తుంది. CRW-001-1JR పేరుతో రాబోతున్న ఈ వాచ్ రింగ్ డిసెంబర్‌లో జపాన్‌లో లాంఛ్ కానుంది. ఇక దీని ధర రూ. 19,800 ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ స్మార్ట్ గ్యాడ్జెట్ కేవలం అంగుళం పరిమాణం మాత్రమే ఉండనుంది. ఇందులో గంటలు, నిమిషాలు, సెకన్లు సైతం పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి. ఇక రెట్రో ఎల్ఈడి స్క్రీన్ తో రాబోతుంది. ఇందులో మూడు ఫంక్షనల్ బటన్స్ ఉన్నాయి. తేదీ, సమయం, టైం జోన్ తో పాటు ఇతర ఫీచర్స్ ను సైతం నియంత్రించగలగే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఈ రింగ్ వాచ్ రింగ్ లో లైట్ కూడా ఉంటుంది. ఇక డిస్ ప్లేలో ఫ్లాష్ అయ్యే అలారం సైతం ఇందులో ఉంది. ఇక ఒకే బ్యాటరీతో పని చేస్త ఈ స్మార్ట్ గ్యాడ్జెట్ వాటర్ ప్రూఫ్ తో రెండు సంవత్సరాల గ్యారెంటీతో రాబోతుంది. ఈ గ్యాడ్జెట్ పని చేయకుండా ఆగిపోయిన పరిస్థితుల్లో సైతం తేలికగా రిపేర్ చేసే అవకాశం ఉందని తెలిపింది క్యాషియో సంస్థ.
రింగ్ పరిమాణంలో ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ను డిజైన్ చేసినప్పటికీ డిజిటల్ గడియారాల్లో ఉండే ప్రతీ డిజైన్ ఉంటుందని క్యాషియో తెలిపింది. ప్రతి విషయాన్ని క్లియర్ గా చూపించగలుగుతుందని మెటల్ తో ఈ స్మార్ట్ రింగ్ బాడీని తయారు చేశారని.. బాడీ మొత్తం ఒకే విధంగా ఉంటుందని తెలిపింది. దీని ప్రకారం టైమెక్స్ ఇంతకముందు లాంఛ్ చేసిన వాచ్ రింగ్ లా కాకుండా విభిన్నంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏ సైజు వారికైనా సరిపోయే విధంగా ఎక్స్పాండబుల్ పరిమాణంతో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్ గాడ్జెట్ US size 10.5 పరిమాణంలో రాబోతుంది. ఇక సరిపోయే విధంగా అడ్జస్ట్ చేసుకోవడానికి క్యాషియో 2 స్పెన్సర్లను సైతం ఈ రింగ్ లో అందిస్తుంది. ఇక క్యాషియో ఈ విషయం ప్రకటించినప్పటి నుంచి ఈ స్మార్ట్ గాడ్జెట్ ఎప్పుడు వస్తుందా అని టెక్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ : పాపం రిటైర్డ్ ఇంజనీర్.. మోదీ మాట వినకుండా అడ్డంగా బుక్కయ్యాడు.. రూ.10 కోట్లు పోగొట్టుకున్నాడు