Sam CS for Pushpa 2:అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్లో రాబోతున్న చిత్రం పుష్ప -2(Pushpa-2). భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్న ఒకే ఒక్క మాట ‘గంగమ్మ జాతర’. సినిమా మొత్తానికి హైలెట్ కానున్న యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశం ఇదే. ఇక దీనికోసం దాదాపుగా రూ. 64 కోట్లు ఖర్చు చేయగా.. రూ.14 కోట్లు కేవలం రిహార్సల్స్ కోసమే ఖర్చుపెట్టినట్లు ఇటీవల ఈ సినిమా నటుడు వెల్లడించిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలోని ఈ సన్నివేశం కోసం దర్శకనిర్మాతలు ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
చెన్నై ఈవెంట్ లో నిర్మాతలపై దేవీశ్రీ అసహనం..
బన్నీ ఇందులో అమ్మవారి గెటప్ లో కనిపిస్తున్నారు అని చిత్ర బృందం గతంలోనే వెల్లడించింది. ఇక టీజర్, ట్రైలర్లో ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షాట్స్ కూడా విపరీతంగా హైలైట్ అయ్యాయి. దీంతో డిసెంబర్ 5 కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఇకపోతే ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad)సంగీతాన్ని అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మరో ముగ్గురిని రంగంలోకి దింపారు మేకర్స్ . దీంతో దేవిశ్రీప్రసాద్ నిర్మాతలపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు, ఇటీవల చెన్నైలో జరిగిన స్పెషల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో తెలిసింది.
దేవీ శ్రీ ప్రసాద్, తమన్ కు షాక్ ఇచ్చిన చిత్ర బృందం..
ముఖ్యంగా అజనీష్ లోకనాథ్, ఎస్.ఎస్.తమన్, సామ్ సీఎస్ లకు ఒక్కో ఎపిసోడ్ ఇచ్చి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఇప్పటికే తమన్ పుష్ప -2 లో ఒక భాగం అని చెప్పగా.. ఆయన కూడా తమన్ కు ఇచ్చిన పోర్షన్ కి సంబంధించిన బీజీఎం కంప్లీట్ చేశారు. ఇక దీంతో తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ స్కోర్ ఇస్తున్నారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు అటు దేవిశ్రీప్రసాద్ ను కాదని తమన్ ను , తమన్ ను కాదని ఇంకొకరిని రంగంలోకి దింపారని తెలుస్తుంది.తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ క్లారిటీ ఇచ్చేశారు. తాను కూడా పుష్ప -2 కి పనిచేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అది కూడా సినిమాకి హైలైట్ గా నిలవబోతున్న కీలక ఎపిసోడ్ గంగమ్మ జాతరకి పనిచేస్తున్నట్టుగా.. బన్నీ జాతర సీక్వెన్స్ గెటప్ ని పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త దేవిశ్రీప్రసాద్ , తమన్ లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని చెప్పాలి. దేవిశ్రీప్రసాద్ ఈ ఎపిసోడ్ కి మ్యూజిక్ అందిస్తున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాలోని కీలక ఎపిసోడ్ కి దేవిశ్రీప్రసాద్ ను తప్పించి, తమన్ ను రంగంలోకి దింపారు. అయితే ఇప్పుడు తమన్ ను కూడా కాదని సామ్ సీ.ఎస్ ను రంగంలోకి దింపడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ సినిమా లో.. సినిమాకే హైలైట్ గా నిలవనున్న గంగమ్మ జాతర సీక్వెన్స్ కి మ్యూజిక్ అందించి స్టార్ స్టేటస్ అందుకోవాలనుకున్న దేవిశ్రీకి, తమన్ లకు ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు . మరి దీనిపై ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
సామ్ సీఎస్ కెరియర్..
ఇటీవలే కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) హీరోగా నటించిన ‘క’ సినిమాకి సూపర్ స్కోర్ అందించారు సామ్. ఇక ఇప్పుడు అదిరిపోయే గంగమ్మ జాతర పాటకి కూడా మ్యూజిక్ అందివ్వబోతున్నాడు అని తెలిసి ఈయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా సరే సాలిడ్ అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న సుకుమార్, నలుగురు సంగీత దర్శకులను రంగంలోకి దింపడం గమనార్హం.