మనం ఏ దేశానికి వెళ్లినా, అక్కడి ప్రజల సంస్కృతులు, సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అక్కడి ప్రజల మనోభావాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అలాగే, థాయ్ లాండ్ కు వెళ్లిన ప్రతి ఒక్క టూరిస్టు, అక్కడ చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకాక్ ఎలా మసులుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
బ్యాంకాక్ ఈ పనులు అస్సలు చేయకండి!
⦿పార్క్ చేసిన టాక్సీని పొందండి
పార్క్ చేసిన టాక్సీల జోలికి అస్సలు వెళ్లకూడదు. ఎందకంటే, టూరిస్టుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూళు చేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే, నడుస్తున్న టాక్సీలను బుక్ చేసుకోవడం మంచిది. మనీ వేస్ట్ చేయకుండా కాపాడుకోవచ్చు.
⦿రాజ గీతం వచ్చేటప్పుడు నిలబడాలి
థాయ్ లాండ్ లో రాచరికం పట్ల చాలా గౌరవం ఉంటుంది. థాయ్‌లాండ్‌లోని అన్ని సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభంలో ఈ గీతాన్ని ప్లే చేస్తారు. గౌరవసూచకంగా నిలబడాలి. ఒకవేళ నిలబడకపోతే గౌరవం లేని వ్యక్తులుగా భావిస్తారు. అటు రైల్వే స్టేషన్లు, మార్కెట్లు సహా బహిరంగ ప్రదేశాలలో, థాయిలాండ్ జాతీయ గీతం ఉదయం 8 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ప్లే చేస్తారు. అప్పుడు కూడా లేచినిలబడటం మంచిది.
⦿మహిళలు బౌద్ధ సన్యాసుల పక్కన కూర్చోకూడదు
థాయ్ లాండ్ లోని బౌద్ధ సన్యాసులు మహిళలను తాకకూడదనే నియమం ఉంటుంది. అందుకే, మహిళలు సన్యాసులకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
⦿పెగ్గుల కంటే బాటిల్ బెస్ట్
ఒకవేళ నైట్ క్లబ్ కు వెళ్తే పెగ్గులు పెగ్గులుగా మద్యం కొనడం కంటే, ఒకేసారి బాటిల్ కొనడం మంచిది. ఉచింతగా మిక్సర్స్ పొందడంతో పాటు సిబ్బంది గౌరవంగా చూస్తారు.
⦿ఒరిజినల్ పాస్ పోర్టు వెంటన తీసుకెళ్లకండి
ఇతర దేశాల్లో మాదిరిగా పాస్ పోర్టు ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. పాస్ పోర్ట్ ఫోటో కాపీ ఉంటే సరిపోతుంది.
⦿సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వెళ్లండి
థాయ్ లాండ్ లో బోలెడు బౌద్ద ఆలయాలు ఉంటాయి. అత్యంత పురాతనమైన ఆధ్యాత్మిక కేంద్రాలు ఉంటాయి. అక్కడికి సంప్రదాయ దుస్తుల్లో వెళ్లడం మంచిది. మోడ్రన్ డ్రెస్ లో వెళ్తే అగౌరవంగా చూస్తారు.
⦿డబ్బులను తొక్కకూడదు
భారత్ లో మాదిరిగానే అక్కడ కూడా డబ్బును కాలితో తొక్కకూడదు. అక్కడి కరెన్సీ నోట్ల మీద రాజు బొమ్మ ఉంటుంది. నోటును కాలు తాకడాన్ని అక్కడి ప్రజలు అపవిత్రంగా భావిస్తారు.
⦿టిష్యూలు ప్యాక్ ను తీసుకెళ్లండి
బ్యాంకాక్ లో ప్రతి టూరిస్టు తమ వెంట టిష్యూ ప్యాక్ తీసుకెళ్లడం మంచిది. టాయిలెట్ కు వెళ్లినా, రెస్టారెంట్ కు వెళ్లినా వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
⦿ఎక్కడైనా చూసినా మంచి నీళ్లే
బ్యాంకాక్ లో పబ్లిక్ టాయిలెట్స్ లో దొరికే నీరు చాలా స్వచ్ఛమైనది. ఎక్కడైనా నీళ్లు తాగవచ్చు. ఎందుకంటే, అక్కడ మినరల్ వాటర్ ను సరఫరా చేస్తారు.
⦿తల మీద చెయ్యి పెట్టకూడదు
బౌద్ధ సంప్రదాయ ప్రకారం తలను స్వర్గానికి దగ్గరగా ఉండే ప్రదేశంగా భావిస్తారు. అందుకే, అపరిచిత వ్యక్తులు తల మీద చెయ్యి పెట్టడాన్ని అభ్యంతరకరంగా భావిస్తారు.
Read Also: అరకు అందాలు చూడాలనుకుంటున్నారా? అద్దాల కోచ్ వచ్చేస్తోంది!