Pushpa 2 Shooting : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ప్రస్తుతం నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ పుష్ప 2 ( Pushpa2 ). బన్నీ లైఫ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 రాబోతున్న విషయం తెలిసిందే. సుకుమార్ పుష్ప ను తెరకెక్కించిన తీరు ప్రతి ఒక్కరికి బాగా నచ్చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు. అల్లు అర్జున్ కు అవార్డులను కూడా తెచ్చిపెట్టింది.. నేషనల్ వైడ్ గా పుష్ప సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు రాబోతున్న పుష్ప 2 సినిమా పై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి.. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను థియేటర్లలో చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు కొద్దీ రోజులు మాత్రమే ఉండటంతో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొనే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే సినిమాకు అన్ని ఏరియాల్లోనూ బిజినెస్ క్లోజ్ అయింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిసి మొత్తంగా రూ.1500 కోట్ల వరకు చేసినట్లు తెలుస్తోంది. నిర్మాతలకు భారీ లాభాలను పుష్ప 2 తీసుకు వస్తుందని ఇండస్ట్రీలో టాక్. నవంబర్ 10 కల్లా సినిమా షూటింగ్ పూర్తి చెయ్యాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.
విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తన గొడ్డలిని ఎత్తుకు వెళ్లాడు అంటూ అయాన్ గురించి షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దెయ్యాల గెటప్ లో అల్లు అర్హ, అయాన్ లు ఉన్న ఫోటోలను అల్లు స్నేహారెడ్డి పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప 2 సినిమా విషయానికి వస్తే వచ్చే నెల రెండో వారంతో షూటింగ్ పూర్తి అవ్వబోతుంది. సుకుమార్ ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను ఐటం సాంగ్ కోసం తీసుకు రాబోతున్నాడట. ఆమె ఎవరు అనేది అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 నుంచి ఇటీవల వచ్చిన ప్రోమో, పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతూనే ఉంది..
ఇక ఈ మూవీకి దాదాపు 500 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. అయితే అన్ని ఏరియాల్లో కలిపి వెయ్యి కోట్లు రాబట్టడం పక్కా అని ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు మొదలు పెట్టారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న పుష్ప 2 లో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో అల్లు అర్జున్ లేడీ గెటప్, జాతర ఎపిసోడ్స్ కి ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయం అంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి అంచనాలను రీచ్ అవుతుందో తెలియాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ చెయ్యాల్సిందే..