BigTV English

Pushpa Kesava Arrest | ‘పుష్ప’ ఫ్రెండ్ కేశవ అరెస్ట్.. మహిళ ఆత్మహత్య కేసు!

Pushpa Kesava Arrest | ‘పుష్ప’ ఫ్రెండ్ కేశవ అరెస్ట్.. మహిళ ఆత్మహత్య కేసు!

Pushpa Kesava Arrest | ‘పుష్ప’ సినిమాలో హీరో అల్లు అర్జున్‌ స్నేహితుడు కేశవ పాత్ర పోషించిన సహాయ నటుడు జగదీశ్‌‌ను హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. జగదీశ్ తన సినిమా పాత్ర కేశవ పేరుతో ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం పుష్ప -2 సినిమాలో కూడా నటిస్తున్నాడు.


ఒక మహిళ మరో వ్యక్తితో ఉన్నప్పుడు తీసిన ఫొటోను సోషల్ మీడియాలో పెడతానంటూ ఆమెను జగదీశ్ బ్లాక్ మెయిల్ చేయగా.. ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో పోలీసులు విచారణ చేయగా.. చనిపోయిన మహిళకు ‘పుష్ప’ ఫేమ్ జగదీశ్‌కు సినీ రంగంలో పరిచయముందని తెలిసింది. నవంబర్ 27న ఆ మహిళ మరో వ్యక్తితో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్ వారిద్దరి ఫొటో తీశాడని.. ఆ ఫొటో త్వరలోనే సోషల్ మీడియాలో పెడతానని ఆమెకు బెదిరించేవాడు.. అయితే ఆమె జగదీశ్ పెట్టే వేధింపులు భరించలేక నవంబర్ 27న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు జగదీశ్‌పై కేసు నమోదు చేసి.. అతని కోసం గాలిస్తున్నారు.

కానీ జగదీశ్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే పంజాగుట్ట పోలీసులు అతడిని బుధవారం పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన తరువాత అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×