BigTV English

Jammu Kashmir Parliament | పార్లమెంటులో జమ్మూకశ్మీర్‌ బిల్లులు ఆమోదం.. ఉగ్రవాద ఘటనలు లేకుండా చేయడమే లక్ష్యం

Jammu Kashmir Paliament | జమ్ము కశ్మీర్‌‌ రాష్ట్రంలో అసెంబ్లీ ఏర్పాటు చేసేందుకు ‘జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ బిల్లు-2023’, ‘జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023′ లను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్లులకు బుధవారం లోక్ సభలో ఆమోదం లభించింది. జమ్ము కశ్మీర్‌‌‌లో పునర్విభజన జరిగాక అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య, రిజర్వేషన్ ఏ వర్గాలకు చెందుతుందనే ఈ రెండు బిల్లులలో అంశాలుగా ఉంటాయి.

Jammu Kashmir Parliament | పార్లమెంటులో జమ్మూకశ్మీర్‌ బిల్లులు ఆమోదం.. ఉగ్రవాద ఘటనలు లేకుండా చేయడమే లక్ష్యం

Jammu Kashmir Parliament | జమ్ము కశ్మీర్‌‌ రాష్ట్రంలో అసెంబ్లీ ఏర్పాటు చేసేందుకు ‘జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ బిల్లు-2023’, ‘జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023′ లను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్లులకు బుధవారం లోక్ సభలో ఆమోదం లభించింది. జమ్ము కశ్మీర్‌‌‌లో పునర్విభజన జరిగాక అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య, రిజర్వేషన్ ఏ వర్గాలకు చెందుతుందనే ఈ రెండు బిల్లులలో అంశాలుగా ఉంటాయి. జమ్ము కశ్మీర్‌‌‌లో ఉన్న ఆర్టికల్ 370ని పూర్తగా రద్దు చేశాక.. అక్కడ పునర్విభజన, రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.


ఇప్పటివరకు జమ్ము కశ్మీర్‌‌‌ అసెంబ్లీలో 83 నియోజకవర్గాలున్నాయి. తాజా అమోదం పొందిన బిల్లుల ప్రకారం.. దాన్ని 90కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం కశ్మీర్‌ డివిజన్‌లో 46, జమ్ము డివిజన్‌లో 37 అసెంబ్లీ సీట్లుండగా.. వాటి స్థానంలో కశ్మీర్‌ డివిజన్‌లో 47, జమ్ము డివిజన్‌లో 43కు పెంచనున్నట్లు కేంద్ర హోం అమితా షా చెప్పారు.

పార్లమెంటులో ఈ బిల్లుల గురించి ప్రస్తావిస్తూ పాకిస్థాన్ ఆక్రమించుకున్న కశ్మీర్ భూభాగాన్ని కూడా కలుపుకొని కొత్త నియోజకవర్గాలుంటాయని కేంద్ర మంత్రి తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 24 నియోజకవర్గాలు చేస్తామని ఆయన అన్నారు. అలాగే కశ్మీర్‌లో రెండు స్థానాల్లో కశ్మీర్ నుంచి వలస వెళ్లిన కశ్మీరీ పండిట్లకు రిజర్వేషన్ ఉంటుందని.. ఒక స్థానంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ వారికి రిజర్వేషన్ ఉంటుందిన చెప్పారు. అలాగే ఎస్సీ/ఎస్టీ వర్గాలకు 9 స్థానాలు కేటాయించినట్లు తెలిపారు.


కశ్మీర్‌ బిల్లులతో అన్యాయానికి గురైన కశ్మీరీ పండిట్లు, పాక్ ఆక్రమిత కశ్మీరా ప్రాంతంలో ఉన్నవారికి న్యాయం జరుగుతుందని చెప్పారు. వారందరూ గత 70 ఏళ్ల నుంచి అన్యాయానికి గురయ్యారని అన్నారు. ఈ బిల్లులతో వారందరికీ గౌరవం దక్కుతుందని అదే మన రాజ్యంగ ప్రాథమిక ఉద్దేశమని పేర్కొన్నారు. కశ్మీర్‌లో అణచివేతకు గురైన వారంతా శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారని.. ఈ బిల్లులతో ఇక నుంచి వారికి ఉద్యోగావకాశాలు, విద్య, రిజర్వేషన్ల సాయంతో లభిస్తుందని అమిత్ షా చెప్పారు.

అలాగే ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతూ.. ఆర్టికల్‌ 370 తొలగింపు తర్వాత హింసాత్మక ఘటనల సంఖ్య తగ్గిందని, 2026 సంవత్సరం కల్లా ఉగ్రవాద దాడుల ఘటనలు జరగకుండా చేయడమే తమ ప్రణాళికల లక్ష్యమని ఆయన చెప్పారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×