BigTV English

Pushpa2 Collections : బాక్సాఫీస్ ఊచకోత.. పుష్ప గాడి రికార్డుల మోత.. ఎన్ని కోట్లంటే..?

Pushpa2 Collections : బాక్సాఫీస్ ఊచకోత.. పుష్ప గాడి రికార్డుల మోత.. ఎన్ని కోట్లంటే..?

Pushpa2 Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన మూవీ పుష్ప 2.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోతను మోగిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెరగడంతో కలెక్షన్స్ బాగా పెరిగాయని తెలిసిందే.. అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ ను బాగానే వసూల్ చేసింది పుష్ప 2..ఒకవైపు అల్లు అర్జున్ పై రూమర్స్ వినిపించినా, అరెస్ట్ అయిన సినిమా కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. పుష్ప గాడు బాక్సాఫీస్ ఊచకోత మొదలు పెట్టాడు. మరి ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ ను వసూల్ చేసిందో ఒక్కసారి చూసేద్దాం..


పుష్ప -1 సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రూ. 500 కోట్ల బడ్జెట్ ను పెట్టారు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. భారతీయ సినీ చరిత్రలోనే ఏ హీరోకి, ఏ సినిమాకు జరగని విధంగా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపరిచాడు అల్లు అర్జున్. రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల షేర్ టార్గెట్‌గా బరిలోకి దిగిన పుష్ప 2 కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్లను రాబట్టింది. 12 రోజులైన కోట్లు రాబట్టి అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు పడేలా చేసింది సినిమా.. అల్లు అర్జున్ మేనరిజమ్‌తో నార్త్ ఆడియన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. ఇప్పటికే హిందీలో రూ. 700 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించి కనివినీ ఎరుగుని రేంజ్‌లో రికార్డులు నెలకొల్పింది పుష్ప 2..

ఇప్పటివరకు వసూల్ చేసిన కలెక్షన్స్ ను చూస్తే.. 12 రోజులకు పుష్ప 2 భారీగా వసూల్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.32 కోట్లు, హిందీలో రూ. 22 కోట్లు, తమిళనాడు లో రూ.1.15 కోట్లు, కర్ణాటక, కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాల లో కలిపి రూ. 1.45 కోట్లు , ఓవర్సీస్‌లో రూ. 3 కోట్ల చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ. 36 కోట్ల వసూళ్లను సాధించింది. మొత్తంగా 12 రోజుల్లో పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1409 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత వేగంగా రూ. 1400 కోట్ల మార్క్‌ను అందుకున్న సినిమాగా నిలిచింది. గతంలో వచ్చిన ఎస్ఎస్ రాజమౌళి ఎపిక్ వండర్ బాహుబలి 2కి ఈ ఫీట్ సాధించడానికి 16 రోజులు పట్టగా.. పుష్ప 2 కేవలం 11 రోజుల్లోనే ఈ మార్క్ చేరుకుంది.. ఇదే జోరులో కలెక్షన్స్ రాబడితే మాత్రం అతి త్వరలోనే 2000 కోట్లు రాబట్టి తెలుగు మూవీ చరిత్రను తిరగ రాయడం పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ట్రేడ్ పంతులు కూడా మరో మూడు రోజుల్లో 2వేల కోట్లు దాటిస్తుందని అంచనా వేస్తుంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×