BigTV English

OTT Movie : క్రికెట్ పిచ్చి ఉన్నవాళ్లు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు… ఏ ఓటిటిలో ఉన్నాయంటే?

OTT Movie : క్రికెట్ పిచ్చి ఉన్నవాళ్లు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు… ఏ ఓటిటిలో ఉన్నాయంటే?

OTT Movie : క్రికెట్ ఈ పేరు వింటే ఇండియన్ సిటిజన్స్ పిచ్చెక్కిపోతారు. ప్రాణం కన్నా ఎక్కువగా క్రికెట్ ని ప్రేమిస్తారు ఇండియన్స్. అటువంటి కాన్సెప్ట్ తో ప్రేక్షకులముందుకు వస్తే ఆ సినిమాలను ఎలా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేశాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ లో సందడి చేస్తున్న ఈ సినిమాలపై ఓ లుక్ వేద్దాం పదండి.


లగాన్ : వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఇండియా (Lagaan : Once upon a time in india)

2001లో హిందీలో విడుదలైన ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాని అమీర్ ఖాన్ నిర్మించారు. ఈ సినిమాకు అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించాడు. అమీర్ ఖాన్, గ్రేసీ సింగ్, ప్రధాన పాత్రల్లో నటించారు. 25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన లగాన్ 15 జూన్ 2001న విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ భుజ్ సమీపంలోని గ్రామాల్లో జరిగింది. లగాన్ సినిమాకు నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆర్ట్ డైరెక్టర్‌గా చేశారు. ఎ.ఆర్ రెహమాన్ సంగీతం తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది. ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడిన చివరి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది.


ఎమ్మెస్ ధోని : ది అన్ టోల్డ్ స్టోరీ (M.S.Dhoni : The Untold Story)

ఎమ్మెస్ ధోని మూవీ 2016లో హిందీ భాషలో విడుదలైంది. భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగా రూపొందించారు. అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిశా పటాని, కియారా అద్వానీ, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలైంది. ఈ సూపర్ హిట్ మూవీ హాట్స్టార్ (hotstar) లో స్ట్రీమింగ్ అవుతుంది.

800

శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా 2023లో విడుదలైంది. వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నాజర్, రిత్విక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ను అక్టోబరు 6న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలచేశారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

లబ్బర్ పండు (Lubber Pandhu)

లబ్బర్ పాండు 2024లో విడుదలైన తమిళ స్పోర్ట్స్ డ్రామా మూవీ. ఈ మూవీకి తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించాడు.ఈ చిత్రంలో సంజన కృష్ణమూర్తి, స్వసిక, బాల శరవణన్, కాళి వెంకట్, గీతా కైలాసం, దేవదర్శిని,జెన్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. లబ్బర్ పాండు ప్రపంచవ్యాప్తంగా 20 సెప్టెంబర్ 2024న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి సీన్ రోల్డాన్ సంగీతం అందించారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ మూవీ హాట్ స్టార్ (hotstar) లో స్ట్రీమింగ్ అవుతుంది.

Related News

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

Big Stories

×