BigTV English

Pushpa 2 Day 3 collection : బాక్సాఫీస్ ను దున్నెస్తున్న పుష్పరాజ్.. అస్సలు తగ్గేదేలే మచ్చా..

Pushpa 2 Day 3 collection : బాక్సాఫీస్ ను దున్నెస్తున్న పుష్పరాజ్.. అస్సలు తగ్గేదేలే మచ్చా..

Pushpa 2 Day 3 collection: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2.. భారీ అంచాలతో విడుదలై రికార్డుల మోత మోగిస్తుంది. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ వసూళ్ల సునామి సృష్టిస్తుంది. అల్లు అర్జున్, సుక్కు కాంబోలో గతంలో వచ్చిన పుష్ప రికార్డులను క్రాస్ చేసింది. ఒక్క ఏరియాలోనే కాదు. అన్ని ఏరియాలో కూడా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. పుష్ప 2 థియేటర్లలోకి వచ్చి మూడు రోజులు అవుతున్నా కూడా ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఓ వార్త షికారు చేస్తుంది. . మొదటి రోజు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక రెండో రోజు కూడా అదే జోరు.. ఎక్కడా తగ్గేదేలే. మొదట ఓపెనింగ్స్ కాస్త తగ్గిన మళ్లీ ఎండ్ ఆఫ్ ది డే కు వసూళ్లు పుంజుకున్నాయని తెలుస్తుంది. పుష్ప 2 ఊహించినట్లుగానే బాక్సాఫీస్ దుమ్ముదులిపేస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ లేని విధంగా కలెక్షన్స్ కుమ్మేస్తున్నాడు పుష్పరాజ్.. ఇక మూడు రోజులకు గాను ఎంత కలెక్షన్స్ ను రాబట్టిందో ఒక్కసారి చూసేద్దాం..


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దెబ్బకు స్టార్లు, సూపర్‌స్టార్ల రికార్డులు బద్ధలవుతున్నాయి. తొలిరోజు విశ్వరూపం చూపించిన బన్నీ.. రెండో రోజు ఎలాంటి వసూళ్లు సాధిస్తాడో చూడాలి. మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్పారాజ్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబులు కీలక పాత్రల్లో నటించారు. మొదటి నుంచి మూవీ నుంచి విడుదలైన అప్డేట్స్ అన్ని కూడా భారీ హైప్ ను తీసుకురావడంతో ఇందుకు తగినట్లుగానే పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి రూ. 1000 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని ఫిలిం ఇండస్ట్రీలో ఓ వార్త షికారు చేస్తుంది.. ఇప్పుడు కలెక్షన్స్ కూడా అదే జోష్ లో కాసుల వర్షం కురిపిస్తున్నాయని తెలుస్తుంది.

మొదటి రోజు వసూళ్లను చూస్తే.. దేశ వ్యాప్తంగా రూ. 180 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దుమ్ములేపిండు పుష్పరాజ్.. తెలుగు రాష్ట్రాల్లో రూ.90 కోట్లు, హిందీలో రూ.69 కోట్లు,  మలయాళంలో రూ. 6 కోట్లు, తమిళనాడులో రూ. 8 కోట్లు, కర్ణాటకలో రూ. 2కోట్లు , రెస్టాఫ్ ఇండియాలో రూ. 7 కోట్లు చొప్పున పుష్ప 2 ఓపెనింగ్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోగా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 250 కోట్లు అందుకుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.30 కోట్లు, హిందీలో రూ. 60 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కర్ణాటకలో రూ. 8 కోట్లు, కేరళ రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 కోట్ల చొప్పున ఇండియా వైడ్‌గా రూ. 110 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్‌లో రూ. 20 కోట్ల వసూళ్లు సాధించడంతో మొత్తంగా రెండో రోజు పుష్ప 2 రూ. 130 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా తెలుస్తుంది. ఇక మూడో రోజు ర్యాంపేజ్.. ఓపెనింగ్స్ అక్కడక్కడ డౌన్ అయ్యిన కూడా రూ. 449 కోట్లు వరకు వసూల్ చేసిందని పుష్ప 2 మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అంటే కేవలం మూడు రోజులకే 450 కోట్ల వసూల్ రాబడితే ఇక ఐదో జోష్ తో ముందుకు సాగితే మరో మూడు, నాలుగు రోజుల్లో 1000 కోట్ల క్లబ్ లోకి చేరడం పక్కా అని ఇండస్ట్రీలో టాక్.. వీకెండ్ కావడంతో సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త షికారు చేస్తుంది..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×