Pushpa2 Collections : భారతీయ సినీ చరిత్రలో అల్లు అర్జున్ పుష్ప 2 అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రెండు వారాలు పూర్తి అయిన పుష్ప రాజ్ కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. వారం రోజుల లోపే 1000 కోట్లను కలెక్ట్ చేసింది. ఇప్పుడు లాంగ్ రన్ గా థియేటర్ లో సినిమా కొనసాగితుంది. 1609 కోట్లు వసూల్ చేసింది. ఇక ఒక్క అడుగుతో బాహుబలి 2 రికార్డులను టచ్ చేస్తుంది. ఇప్పటివరకు ఏ మూవీ బాహుబలి 2 రికార్డులను టచ్ చెయ్యలేదు. మొదటి సారి పుష్ప 2 రికార్డు బ్రేక్ చేయబోతుంది. ఇదే స్పీడులో కలెక్షన్స్ రాబడితే అతి త్వరలోనే కేజీఎఫ్ రికార్డును కూడా బ్రేక్ చేస్తుంది. అయితే ఒకవైపు పుష్ప 2 ఇండియన్ సినిమాల రికార్డును బ్రేక్ చేస్తున్నా ఆ సంతోషం అల్లు అర్జున్ ముఖంలో కనిపించలేదని ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. ఎందుకు? ఏమైందని ఫ్యాన్స్ తెగ ఆరాలు తీస్తున్నారు. అందుకు కారణం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి..
పుష్ప 2 మూవీ ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లిస్ట్ లో 3వ ప్లేస్‌లో ఉంది. ఇప్పటి వరకు దాదాపు 1600 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. తెలుగులో బాహుబలి 2 తర్వాత పుష్ప2 మూవీనే… ఈ ఫీట్ సాధించింది. త్వరలోనే బాహుబలి 2 రికార్డును కూడా టచ్ చేయొచ్చు. కానీ, ఈ హ్యాపీనెస్ అల్లు అర్జున్ కి లేదు. అందుకు కారణం సంధ్య థియేటర్ ఇష్యు.. సంధ్య థియేటర్ ఇష్యూ వల్ల అల్లు అర్జున్ సెలబ్రెట్ చేసుకోలేక పోతున్నాడు. ఇప్పుడు సెలబ్రెట్ చేసుకుంటే… ప్రాణం పోతే… సెలబ్రెషన్సా అంటూ ఫైర్ అవుతారు. కానీ, అల్లు అర్జున్ మాత్రం తెలుగులో నెంబర్ వన్ అవ్వాలని, హైయెస్ట్ కలెక్షన్లు సాధించాలని కలలు కన్నాడు. ఆ కలలు నిజమవుతున్న టైంలో… సెలబ్రెట్ చేసుకోలేకపోతున్నాడు. ఫ్యాన్స్ కూడా సైలెంట్ గానే ఉన్నారు.. తొక్కిసలాటలో స్పృహ కోల్పోయిన శ్రీతేజ్ పరిస్థితి నార్మల్ అయ్యాకే పుష్ప 2 సక్సెస్ ను సెలెబ్రేట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ పై నడిచిన ఈ చిత్రం ఇండియా వైడ్ ఇపుడు వండర్స్ సెట్ చేస్తుంది. ఇండియా వైడ్ గా ఇపుడు ఆ సీక్వెల్స్ రికార్డులు అన్నీ బ్రేక్ చేస్తూ సంచలనంగా మారింది అని చెప్పాలి. కాగా ఇండియన్ సినిమా దగ్గర వసూళ్ల పరంగా బాహుబలి 2 హైయెస్ట్ రికార్డు సెట్ చేసింది. కానీ బుకింగ్స్ పరంగా కేజీఎఫ్ 2 కి బుక్ మై షో యాప్ లో బిగ్గెస్ట్ రికార్డు ఉంది. కాగా పుష్ప వసూళ్ల పరంగా ఆల్రెడీ కేజీఎఫ్ చాప్టర్ 2 ని దాటేసింది.. ఇక త్వరలోనే మరో రికార్డు ను పుష్ప 2 సొంతం చేసుకోబుతుందని ఓ వార్త వినిపిస్తుంది. జనవరి 9 న ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. అప్పటివరకు థియేటర్ల లో చెప్పుకోతగ్గా సినిమాలు కూడా లేవు.. 3000 కోట్లు రాబట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి మరి ఎలాంటి రికార్డులను అందుకుంటుందో… వీకెండ్ కావడంతో ఈరోజు, రేపు కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.