Pushpa2 Collections : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది.. మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. రిలీజ్ కు ముందే భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టిస్తుంది. రోజు రోజుకు బాక్సాఫీస్ కలెక్షన్స్ పెరుగుతూ అందరికి షాక్ ఇస్తున్నాయి. ఇక తెలుగులో కంటే హిందీలో ఎక్కువగా కలెక్షన్లు సాధిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకూ అత్యధికంగా రూ.400 కోట్లువసూల్ చేసింది… హిందీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఎనిమిది రోజులకు ఎన్ని కోట్లు సంపాదించిందోఒక లుక్ వేద్దాం పదండీ..
నార్త్ ఆడియన్స్ ఈ సినిమాకు నిరాజనం పలుకుతున్నారు. అందుకే హిందులో భారీగా కలెక్షన్స్ వసూల్ చేసి రికార్డ్ బ్రేక్ చేసింది. ఇకపోతే అత్యంత ఫాస్ట్ గా రూ.1000 కోట్ల గ్రాస్ కు కలెక్ట్ చేసిన తొలి ఇండియన్ సినిమాగా పుష్ప2 రికార్డులు క్రియేట్ చేసింది. కాగా ఈ ఫీట్ ని పుష్ప 2 కేవలం 6 రోజుల్లోనే అందుకుంది. అంతేకాదు రిలీజ్ అయిన మొదటివారంలోనే రూ.1067 కోట్లకు పైగా కలెక్ట్ చేరిన తోలి టాలీవుడ్ సినిమాగా రికార్దులెక్కింది. ఇక ఎనిమిదోవ రోజు 1100 లకు పైగా గ్రాస్ ను వసూల్ చేసిందని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకూ టాలీవుడ్ లో మొదటివారంలో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రాల లిస్టులో మొదటి స్థానంలో ఉంది. ఇక మొదటి సినిమాగా 2000 కోట్లు కొల్లగొట్టేస్తుందని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు.
ఇక మూవీ కోసం అల్లు అర్జున్ బాగా కష్ట పడ్డ ప్రమోషన్స్ లో ఒక్కడే సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాడు. అతని కష్టం ఊరికేపోలేదు. కలెక్షన్స్ భారీ కలెక్షన్ ను కొల్లగొట్టేస్తుంది.. మొదటి రోజు నుంచి వరుసగా కలెక్షన్స్ ను అందుకుంటుంది. 5 రోజుల వరకు కలెక్షన్స్ బాగానే వచ్చిన కలెక్షన్స్ నిన్నటి నుంచి భారీగా తగ్గాయి. ఎందుకు తగ్గాయో తెలియదు కానీ పుష్ప జోరు తగ్గిందని కలెక్షన్స్ ను బట్టే చెప్పొచ్చు. ఇలానే ఉంటే 2 వేల కోట్లు రాబట్టడం కష్టమే మరి.. ఇక మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్పారాజ్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబులు కీలక పాత్రల్లో నటించారు. మొదట ఓపెనింగ్స్ కాస్త తగ్గిన మళ్లీ ఎండ్ ఆఫ్ ది డే కు వసూళ్లు పుంజుకున్నాయని తెలుస్తుంది. పుష్ప 2 ఊహించినట్లుగానే బాక్సాఫీస్ దుమ్ముదులిపేస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ లేని విధంగా కలెక్షన్స్ కుమ్మేస్తున్నాడు పుష్పరాజ్.. ఈ వీకెండ్ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.