BigTV English

Pushpa2 – Jr NTR : ‘పుష్ప 2’ సెట్స్‌లోకి ఎన్టీఆర్‌.. ఫొటో వైర‌ల్‌

Pushpa2 – Jr NTR : ‘పుష్ప 2’ సెట్స్‌లోకి ఎన్టీఆర్‌.. ఫొటో వైర‌ల్‌

Pushpa2 – Jr NTR : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. ఈ చిత్రం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. మరో వైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తోన్న‌ NTR 30 షూటింగ్ కూడా అక్క‌డే జ‌రుగుతుంది. సాధార‌ణంగా ఆర్‌.ఎఫ్‌.సిలో ప‌లు షూటింగ్స్ జ‌రుగుతుండ‌ట‌మ‌నేది కామ‌న్‌గా జ‌రిగే విష‌య‌మే కదా, ఇందులో కొత్తేముంద‌ని అనుకోకుండా. అస‌లు విష‌య‌మేమంటే.. పుష్ప 2 సెట్స్‌లోకి ఎన్టీఆర్ వెళ్లారు. ఆయ‌న సెట్స్ వెళ్లిన‌ప్ప‌టికి ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఓ వైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, మ‌రో వైపు డైరెక్ట‌ర్ సుకుమార్‌తో ఉన్న అనుబంధం కార‌ణంగానే పుష్ప 2 ది రూల్ సెట్స్‌లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టిన‌ట్లు వార్త‌లు కూడా వ‌చ్చాయి.


కానీ అస‌లు విష‌య‌మేమంటే పుష్ప 2 షూటింగ్ జ‌ర‌గ‌టం లేదు. ఎందుకంటే రీసెంట్‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ ఆఫీసుపై ఐటీ దాడులు జ‌రిగాయి. దీంతో షూటింగ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చారు. మ‌రి అక్క‌డకు బ‌న్నీ వ‌చ్చాడ‌ని తార‌క్ వెళ్లాడో మ‌రేదైనా కార‌ణ‌మో తెలియ‌దు కానీ.. పుష్ప 2 సెట్స్‌లో తార‌క్ ఉన్న‌ప్ప‌టి ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. అల్లు అర్జున్‌, ఎన్టీఆర్ మ‌ధ్య చాలా మంచి అనుబంధం ఉంది. రీసెంట్‌గా అల్లు అర్జున్ బ‌ర్త్ డేకి బావా అని అంటూ తార‌క్ విషెష్ కూడా చెప్పటం.. ఇద్ద‌రూ స‌ర‌దాగా మాట్లాడుకోవ‌టం అనేది హాట్ టాపిక్‌గా మారింది.

అల్లు అర్జున్ విష‌యానికి వ‌స్తే పుష్ప2 ది రూల్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో సంద‌డి చేయ‌టానికి రెడీ అవుతున్నారు. మ‌రో వైపు ఎన్టీఆర్ సైతం త‌న 30వ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ రెండు భారీ చిత్రాల కోసం ఇటు అభిమానులు, అటు ప్రేక్ష‌కులు, ట్రేడ్ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎద‌రు చూస్తున్నాయి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×