BigTV English

Shane Warne : క్లాసిక్ లెగ్ స్పిన్ బౌలింగ్ అంతరించిపోతోందా? టీ20లే స్పిన్నర్లను నాశనం చేస్తోందా?

Shane Warne : క్లాసిక్ లెగ్ స్పిన్ బౌలింగ్ అంతరించిపోతోందా? టీ20లే స్పిన్నర్లను నాశనం చేస్తోందా?
Shane Warne

Shane Warne : షేన్ వార్న్ మరణంతో క్రికెట్ వరల్డ్ మొత్తం ఒక్కసారిగా షాక్. షేన్ వార్న్ లాంటి బౌలర్ మరొకరు లేరు, రారు కూడా. ఇప్పటికీ… షేన్ వార్న్ వేసిన బంతులపై చర్చ జరుగుతూనే ఉంది. ఎన్నో యూట్యూబ్ ఛానెళ్లలోనూ, క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ సైతం ఆ బాల్ అలా ఎలా వేశాడనే విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ. ఆఫ్ స్టంప్ అవతల పడిన బాల్… వికెట్ల మీదకు దూసుకురావడం, అంత కర్వ్ తీసుకుని వికెట్లపైకి చొచ్చుకురావడం నిజంగా అద్భుతమే. ఇప్పటి వరకు ఇలాంటి కర్వ్స్ వేసింది ఒక్క షేన్ వార్న్ మాత్రమే. ఒకానొక దశలో షేన్ వార్న్ బౌలింగ్ అంటేనే భయపడిపోయారు. ఇక టెస్ట్ క్రికెట్లో అయితే.. షేన్ వార్న్ కారణంగా వికెట్లు సమర్పించుకుని మ్యాచ్ ఓడిపోయిన ఘటనలు కోకొల్లలు. ఒక విధంగా వరల్డ్ క్రికెట్ ను తన లెగ్ స్పిన్‌తో శాసించిన దేవుడు.


లెగ్ స్పిన్ బౌలింగ్‌లో.. ఆఫ్ఘాన్ బౌలర్ రషీద్ ఖాన్, పాక్ బౌలర్ యాసిర్ షా, సౌతాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్, ఇండియా బౌలర్ అమిత్ మిశ్రా, దేవేంద్ర బిషూ… తమ సత్తా చాటిన వాళ్లే. అయితే, వీళ్ల బౌలింగ్ చచ్చిపోతోంది. గ్రేట్ టాలెంట్ ఉన్నప్పటికీ… కేవలం టీ20లు, ఐపీఎల్‌లు ఆడుతూ నాలుగు ఓవర్లకే పరిమితం అవుతున్నారు. టెస్ట్ క్రికెట్ ఆడితేనే.. లెగ్ స్పిన్ ను ఆస్వాదించొచ్చు. అసలు ఎన్నేసి వేరియేషన్స్ వేయొచ్చో. కాని, అలాంటిది మిస్ అవుతోంది. ఒకవిధంగా టీ20లు లెగ్ స్పిన్ మజా అందనివ్వకుండా చేస్తోంది. టెస్ట్ క్రికెట్ ను మెల్లమెల్లగా చంపేయడం కారణంగానే లెగ్ స్పిన్ మజా ఆస్వాదించలేకపోతున్నారు. ఎంత గొప్ప బౌలర్ అయినా టెస్టులు ఆడడం వేరు, టీ20ల్లో ఆడడం వేరు.

ఆడినవి కొన్ని మ్యాచ్‌లే అయినా.. లెగ్ స్పిన్ బౌలర్లు ఎన్నో మిస్టరీ బాల్స్ వేశారు. వీటిపై ఇప్పటికీ క్రికెట్ కామెంటేటర్లు మాట్లాడుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా రషీద్ ఖాన్, యాసిర్ షా. అతి తక్కువ మ్యాచులలోనే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లుగా రికార్డ్స్ క్రియేట్ చేశారు. బట్.. ఆ రికార్డులు అక్కడే ఆగిపోయాయి. కారణం.. లెగ్ స్పిన్‌ను టీ20 మ్యాచ్‌లు తినేస్తుండడమే.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×