EPAPER

Raa Macha Macha Song : అందరినీ వెనక్కి నెట్టాడు… గ్లోబల్ స్టార్ అనిపించుకున్నాడు

Raa Macha Macha Song : అందరినీ వెనక్కి నెట్టాడు… గ్లోబల్ స్టార్ అనిపించుకున్నాడు

Raa Macha Macha Song : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ ఛేంజర్’ మూవీలోని సెకండ్ సింగిల్ ‘రా మచ్చా మచ్చా’ వ్యూస్ పరంగా దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా 24 గంటల్లో ఫాస్టెస్ట్ వ్యూస్ రాబట్టిన లిరికల్ వీడియోగా కొత్త చరిత్రను క్రియేట్ చేసింది. ఇప్పటిదాకా ఈ లిస్ట్ లో టాప్ లో ఉన్న మహేష్ బాబు స్థానాన్ని ఇప్పుడు చెర్రీ సొంతం చేసుకున్నాడు.


‘రా మచ్చా మచ్చా’ సాంగ్ రికార్డు

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక శంకర్ పలు కారణాల వల్ల ఈ సినిమాను పక్కన పెట్టడంతో ఇప్పటిదాకా మూవీ రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ ను షురూ చేశారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా ‘రా మచ్చా మచ్చా’ అనే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు మెగా అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక తాజాగా 24 గంటల్లో ఈ పాటకు వచ్చిన వ్యూస్ చూస్తే మెగా ఫాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ అందరినీ ఈ పాట ఆకట్టుకుందన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ కేవలం 24 గంటల్లోనే 19.5 మిలియన్ల మెగా మాస్ వ్యూస్ రాబట్టి గ్లోబల్ స్టార్ అంటే ఈ మాత్రం ఉంటుంది అనేలా చేసింది. మహేష్ బాబు పేరు మీద ఉన్న రికార్డును చెర్రీ ఈ ఒక్క పాటతో చెరిపేశాడు.


టాప్ 10 లో ఉన్న మోస్ట్ వ్యూవ్డ్ లిరికల్ వీడియోస్

ఇక 24 గంటల్లో భారీ సంఖ్యలో వ్యూస్ రాబట్టిన టాలీవుడ్ టాప్ 10 లిరికల్ వీడియోల లిస్ట్ లో చెర్రీ మొదటి స్థానంలోకి జెట్ స్పీడ్ తో దూసుకొచ్చేసాడు. కేవలం 24 గంటల్లోనే ‘రా మచ్చా మచ్చా సాంగ్’ 19 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి, ఈ లిస్టులో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అంతకు ముందు వరకు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘దమ్ మసాలా’ సాంగ్ తో ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ‘దమ్ మసాలా’ సాంగ్ 24 గంటల్లో 17.42 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఆ తర్వాత మూడో ప్లేస్ లో కూడా ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘పెన్నీ’ సాంగ్ 16.38 మిలియన్ల వ్యూస్ తో ఉండగా, నాలుగో స్థానంలో ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ సాంగ్ ఉంది. దీనికి 15.68 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక ఆ తర్వాత 14.78 మిలియన్ల వ్యూస్ తో కళావతి, 13.56 మిలియన్ల వ్యూస్ తో ‘మామా మహేశా’, 12.39 మిలియన్ల వ్యూస్ తో ‘ఊ అంటావా’, 10.97 మిలియన్ల వ్యూస్ తో ‘సూసేకి అగ్గి రవ్వ’ సాంగ్ , 10.38 మిలియన్ల వ్యూస్ తో ‘పుష్ప పుష్ప’, 10.20 మిలియన్ల వ్యూస్ తో ‘లాలా భీమ్లా’ సాంగ్స్ వరుసగా ఉన్నాయి. మొత్తానికి రిలీజ్ కాకముందే ‘గేమ్ ఛేంజర్’  మూవీతో చెర్రీ రికార్డులను బ్రేక్ చేస్తుండడం విశేషం.

Related News

OG: బాబాయ్ కంటే ముందు ఓజీ క‌థ నేను విన్నా – వరుణ్ తేజ్

Jani Master: కొరియోగ్రాఫర్ జానీకి భారీ షాక్.. నేషనల్ అవార్డు రద్దు!

Srinu Vaitla : బ్రూస్ లీ డిజాస్టర్ సినిమా కాదు, ఆ సినిమా మంచి లాభాలను తీసుకువచ్చింది

Priyamani: ఇప్పటికీ టార్గెట్ చేస్తూ.. నరకం చూపిస్తున్నారు.. హీరోయిన్ ఎమోషనల్..!

OG Update: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

Harudu Glimpse: కమ్ బ్యాక్ కోసం సిద్ధమయిన హీరో వెంకట్.. ‘హరుడు’ నుండి గ్లింప్స్ విడుదల

Posani: ఎన్ – కన్వెన్షన్ కూల్చడం కరెక్టే.. పోసాని షాకింగ్ కామెంట్..!

×