Raale Puvve Song Released: దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్న పవన్ కుమార్ కొత్తూరి.. మరో అడుగు ముందుకు వేసి హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. మెరిసే మెరిసే సినిమాకి డైరెక్టర్ గా పనిచేసి తన ప్రతిభ ఏంటో ఆడియన్స్ కు చూపించారు. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. రెండో సినిమాకు కూడా తానే దర్శకత్వం వహిస్తూ.. హీరోగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ సినిమాను శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పి బ్యానర్ పై నిర్మించారు. ఆగస్టు 2న విడుదల కాబోతున్న ఈ చిత్రం.. వీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలోకి రానున్నది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. చిత్ర బృందం కంటెంట్ ను రిలీజ్ చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నది. తాజాగా కూడా ఓ పాటను విడుదల చేశారు. ఆ పాటలో మంచి మాస్ అండ్ ఎనర్జిటిక్ బీట్ స్పెషల్ గా ఉంది. ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
Also Read: ‘మా’ ప్రెసిడెంట్ పై మీనా ప్రశంసల వర్షం.. ఎందుకో తెలుసా.. ?
‘రాలే పువ్వే’ అంటూ విడుదలైన ఈ పాట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అందులో రాజ్ పైడి మాస్టర్ స్టెప్పులు యువతను కట్టిపడేసేలా ఉన్నాయి. కార్తీక్ బి కొడకండ్ల అందించిన మ్యూజిక్ ఆడియన్స్ ను కట్టిపడేస్తున్నది. హీరోయిన్లు సాహిబా, స్నేహా అందాలకు కుర్రకారును ఫిదా ఖావడం గ్యారంటీ అంటూ చిత్ర బృందం తెలుపుతున్నది.
ఇదిలా ఉంటే.. సజీష్ రాజేంద్రన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని అందించగా, ఉద్ధవ్ ఎస్బీ ఎడిటర్ గా పనిచేశారు. కాగా, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరితోపాటు పలువురు నటీనటులు ఈ సినిమాలో నటించారు.