BigTV English

Raashi Khanna Emotional: బ్రేకప్ వల్ల నరకం చూసా.. రాశీ ఖన్నా ఎమోషనల్ కామెంట్స్..!

Raashi Khanna Emotional: బ్రేకప్ వల్ల నరకం చూసా.. రాశీ ఖన్నా ఎమోషనల్ కామెంట్స్..!

Rashi Khanna.. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో కుర్రకారు హృదయాలు దోచుకుంది ప్రముఖ గ్లామర్ బ్యూటీ రాశీ ఖన్నా(Rashi khanna). ఒకప్పుడు తెలుగులో చాలామంది స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు అందుకుంది. ప్రస్తుతం ఈమె హిందీలో ‘ది సబర్మతి రిపోర్ట్’ (The Sabarmati Report) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో విక్రాంత్ మాస్సే (Vikranth Massey) హీరోగా నటిస్తున్నారు. అలాగే శోభా కపూర్ (Shobha kapoor), ఏక్తా కపూర్ (Ekta Kapoor) నిర్మించిన ఈ సినిమాలో రిధి డోగ్రా కీలకపాత్ర పోషించారు.


ది సబర్మతి రిపోర్ట్..

ఇక నవంబర్ 15వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగంగా చేపట్టింది. అందులో భాగంగానే ఈ సినిమాలో హీరోయిన్ గా కీలక పాత్ర పోషిస్తున్న రాశీ ఖన్నా ప్రమోషన్స్ లో పాల్గొని పలు ఎమోషనల్ కామెంట్స్ చేసింది. రాశిఖన్నా మాట్లాడుతూ.. “నేను సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేశాను. అక్కడి ప్రేక్షకులు నన్ను చాలా ఆదరించారు. ముఖ్యంగా నేను తొలిసారి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’. ఈ సినిమా విడుదలైన తరువాత తిరుపతి వెళ్ళాము. అక్కడ మమ్మల్ని చాలామంది చుట్టుముట్టారు. అప్పుడు ఏం జరుగుతోందో అర్థం కాక మేనేజర్ ని అడిగితే.. వాళ్లందరూ మీ కోసమే వచ్చారని చెప్పడంతో.. నేను ఆశ్చర్యపోయాను ఆ సంఘటన నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఇక అభిమానుల నుంచి నిన్ను రక్షించడానికి నా మేనేజర్ తో పాటు బౌన్సర్లు కూడా చాలా కష్టపడ్డారు. ఆ ప్రేక్షకుల ప్రేమ అప్పటికి నాకు తెలియదు. కానీ దక్షిణాది ప్రజలు చూపించే ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను “అంటూ తెలిపింది.


బ్రేకప్ కారణంగా మానసిక క్షోభ అనుభవించా..

ఇక పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ..” నేను చాలా ఎమోషనల్ . నాకు కూడా గతంలో ఒక లవ్ స్టోరీ ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల అది బ్రేకప్ అయిపోయింది. ఆ సమయంలో ఎంతో మానసిక వేదన అనుభవించాను. ఒత్తిడికి గురయ్యాను. ఆ బాధ నుంచి బయటపడడానికి నాకు చాలా సమయం పట్టింది. ఒకసారి నమ్మిన తర్వాత ఎలా మోసం చేస్తారు అన్నది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఏదైతేనేం ఆ బాధ నుంచి బయటపడడానికి ఎంతో కష్టపడ్డాను. ఇక ఈజీగా మనుషుల్ని నమ్మడం కూడా మానేశాను. ఇప్పుడిప్పుడే నన్ను నేను మార్చుకొని.. స్ట్రాంగ్ గా నిలబడి కెరియర్ పై దృష్టి పెట్టాను. జీవితంలో ఏది జరిగినా మన మంచికే. చెడు జరిగితే పాఠం నేర్చుకుంటాము..ఏం జరిగినా చింత పడకుండా ధైర్యంగా ముందుకు వెళితే , మన కెరియర్ మరింత బాగుంటుంది అంటూ రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈమె కూడా లవ్ ఫెయిల్యూర్ అని తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం అబ్బాయి ఎవరు అన్న విషయంపై మాత్రం రాశీ ఖన్నా కన్నా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం రాశీ ఖన్నా బ్రేకప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×