Raashii Khanna: ప్రస్తుతం బాలీవుడ్ మార్కెట్ చాలా డౌన్ అయిపోయింది అన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అందుకే స్టార్ హీరోలు సైతం బీ టౌన్ పరిస్థితిపై వాపోతున్నారు. ఇదే సమయంలో సౌత్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాయి. ప్రేక్షకులను మెప్పించే విషయంలో, కలెక్షన్స్ విషయంలో సౌత్ సినిమాలే ముందుంటున్నాయి. సౌత్‌ను చూసి నార్త్ నేర్చుకోవాలి అంటూ చాలామంది నెటిజన్లు ఓపెన్‌గానే కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా కూడా ఈ విషయంపై బోల్డ్ కామెంట్స్ చేసింది. మామూలుగా హీరోయిన్లు ఇలాంటి విషయాలపై స్పందిస్తే అవకాశాలు రావు అని భయపడుతూ ఉంటారు కానీ రాశీ మాత్రం అలా చేయలేదు.
రీమేక్స్ ఎక్కువయ్యాయి
అసలు రాశీ ఖన్నా నటిగా పరిచయమయ్యిందే బాలీవుడ్‌లో. కానీ ఆ తర్వాత వరుస సౌత్ సినిమాల్లో నటించి ఇక్కడ పాపులర్ అయ్యింది. సౌత్‌లో పాపులర్ అయిన తర్వాత బాలీవుడ్ నుండి మళ్లీ పిలుపు రావడంతో అక్కడికి వెళ్లింది. ప్రస్తుతం సౌత్, నార్త్ మొత్తాన్ని కవర్ చేస్తూ బిజీ అయిపోయింది రాశీ ఖన్నా. అలాంటి తను తాజాగా బాలీవుడ్ ఉన్న పరిస్థితి గురించి ఓపెన్‌గా కామెంట్స్ చేసి అందరికీ షాకిచ్చింది. ‘‘బాలీవుడ్‌లో సౌత్ సినిమాలకు సంబంధించిన రీమేక్స్‌ను తరచుగా చూస్తున్నామని నేను కూడా ఒప్పుకుంటాను’’ అంటూ సౌత్ డబ్బింగ్ సినిమాలపైనే బాలీవుడ్ ఆధారపడుతుందని చెప్పకనే చెప్పింది రాశీ ఖన్నా.
మార్పు వస్తోంది
‘‘ఆడియన్స్‌కు కొత్త కంటెంట్ కావాలని, డబ్బింగ్ సినిమాలు ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయని బాలీవుడ్ కూడా గ్రహిస్తుందని నేను అనుకుంటున్నాను. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత సినిమాలకు భాష అనేది అడ్డు రావడం లేదు. అందుకే ఇండస్ట్రీ ఆలోచన కూడా మారడం నేను చూస్తున్నాను. అందుకే వారు కూడా ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేయాలని, కొత్త కొత్త జోనర్లలో సినిమాలు తీయాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజానికి ఎలాంటి టైప్ సినిమాలు వర్కవుట్ అవుతాయని ఎవరూ ఊహించలేకపోతున్నారు’’ అంటూ బాలీవుడ్ మేకర్స్‌లో కూడా మార్పులు వస్తున్నాయని పాజిటివ్‌గా మాట్లాడింది రాశీ ఖన్నా.
Also Read: రైడ్ 2 నుండి తమన్నా లుక్ లీక్.. వామ్మో ఆ అందం ఏంటి.. హీటెక్కుతున్న ఆడియన్స్.!
అదే తేడా
సౌత్, నార్త్ రెండిటిలో వర్క్ చేసిన రాశీ ఖన్నా (Raashii Khanna).. ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులతో పంచుకుంది. ‘‘ఎక్కడైనా అందరూ ప్యాషన్‌తోనే పనిచేస్తారు. మంచి సినిమాలు చేయాలి, అందులో భాగమవ్వాలి అని అనుకుంటారు. ఇప్పుడు భాష అనేది కూడా అడ్డుగోడగా లేదు. కానీ సౌత్ ఇండస్ట్రీ కల్చర్‌కు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. వాళ్ల సినిమాల్లో ట్రెడీషన్‌కు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ప్రతీ భాషలో ఒకే విధమైన ఎమోషన్స్ చూస్తుంటే మనమంతా ఎంత బలంగా కలిసున్నామని అనిపిస్తుంటుంది’’ అని చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా. ప్రస్తుతం తను ‘అగత్య’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఇదొక హారర్ మూవీ. ఇప్పటికే ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీ హిట్‌తో బాలీవుడ్‌లో ఫుల్ ఫార్మ్‌లో ఉంది రాశీ ఖన్నా.