Raid 2 Leak:ఈ మధ్యకాలంలో భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమా కూడా ఈ లీకుల బెడద ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దర్శకనిర్మాతలు ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసినప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి చేత సినిమా నుండి వీడియో క్లిప్స్ లేదా ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ దర్శక నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇకపోతే ఇప్పుడు అజయ్ దేవగన్ (Ajay Devgan) హీరోగా నటిస్తున్న ‘రైడ్ -2’ సినిమా నుంచి కూడా తమన్నా లుక్ కు సంబంధించిన ఈ వీడియో కాస్త చాలా వైరల్ గా మారింది. తమన్నా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో చూపించారు. ముఖ్యంగా ఇందులో తమన్నా లుక్ చూసి వామ్మో ఈ అందం ఏంటి? అంటూ ఆడియన్స్ సైతం హీటెక్కిపోతున్నారు. మూడు పదుల వయసు దాటినా సరే ఇంకా అంతే అందం మైంటైన్ చేస్తూ ఆడియన్స్ ను తన అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది తమన్నా. తమన్నా స్పెషల్ సాంగ్ కు సంబంధించిన ఈ వీడియో లుక్ లీక్ అవడంతో సోషల్ మీడియాలో అందరూ తమన్నా అందం గురించి మాట్లాడుకుంటున్నారు.
అజయ్ దేవగన్ రైడ్ -2 సినిమా విశేషాలు..
ఇక రైడ్ 2 సినిమా విశేషాలకొస్తే.. రాజ్ కుమార్ గుప్తా (Raj Kumar Gupta) దర్శకత్వంలో హిందీ భాషా క్రైమ్ థ్రిల్లర్ గా 2018లో వచ్చిన చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు ‘రైడ్ 2’ సినిమా చేస్తున్నారు. ఇందులో అజయ్ దేవగన్, రితేష్ దేశ్ ముఖ్ తో పాటు వాణి కపూర్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి పనోరమా స్టూడియోస్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్ , క్రిషన్ కుమార్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తుండగా.. 2025 మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రైడ్ సినిమాలో లాగానే ఈ సీక్వెల్ లో కూడా వైట్ కలర్ నేరాలను గుర్తించడానికి.. నిఘా సంస్థలతో పని చేసే ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండీ ఇప్పుడు తమన్నా లుక్ లీక్ అవడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
తమన్నా సినిమాలు..
ఇక తమన్నా విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది స్టోరీ అందించగా.. ‘ఓదెల రైల్వే స్టేషన్’ సీక్వెల్ ఓదెల 2 సినిమా ఏప్రిల్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాలో తమన్నా నాగ సాధ్విగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల సినిమా నుండి ట్రైలర్ విడుదల చేయగా తమన్నా.. తొలిసారి ఆధ్యాత్మిక పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. అందులోని డైలాగ్స్ కూడా చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లలో బ్లాక్ బాస్టర్ అవుతుందని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
Mohanbabu: మోహన్ బాబుకు కోర్ట్ లో చుక్కెదురు.. తప్పుడు సాక్ష్యాలు చూపించారంటూ..!