BigTV English

GT VS RR : భారీ స్కోర్ సాధించిన గుజరాత్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..?

GT VS RR : భారీ స్కోర్ సాధించిన గుజరాత్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..?

GT VS RR :  ఐపీఎల్ 23వ మ్యాచ్ లో ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు జరుగుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో గుజరాత్ 217 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ జట్టు టార్గెట్ 218 పరుగులను ఛేదించాలి.


ఇక ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ 2 ప్లేస్ లో కొనసాగుతోంది. రాజస్థాన్ జట్టు మాత్రం 7వ స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ ల మధ్య ఇప్పటివరకు 6 మ్యాచ్ లు జరిగితే.. అందులో గుజరాత్ 5 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. రాజస్థాన్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో గెలిచింది. ప్రస్తుతం హోరా హోరీ జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ లో గుజరాత్ ఓపెనర్లు శుబ్ మన్ గిల్ 2, సాయి సుదర్శన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ప్రధానంగా సాయి సుదర్శన్ 53 బంతుల్లో 82 పరుగులు చేసి గుజరాత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మరో కీలక ఆటగాడు బట్లర్ 25 బంతుల్లో 36 పరుగులు చేశాడు. షారూఖ్ ఖాన్ 20 బంతుల్లో 36 పరుగులు చేసి తీక్షణ బౌలింగ్ లో స్టంప్ ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన రూథర్ ఫోర్డ్ మొదటి బాల్ కే భారీ సిక్స్ బాదాడు.  రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 1, తీక్షణ 2, దేశ్ పాండే 2,  సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. దీంతో గుజరాత్ జట్టు 217 పరుగులను చేసింది. దీంతో 218 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ ముందు ఉంచింది. గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లలో ఇప్పటి వరకు 6 మ్యాచ్ లు జరిగితే అందులో కేవలం రాజస్థాన్ ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది.


గుజరాత్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే పరుగులు సమర్పించుకున్నప్పటికీ తుషార్ దేశ్ పాండే కీలక వికెట్లను తీశాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ (82) ను ఔట్ చేశాడు. దేశ్ పాండే వేసిన బంతికి వికెట్ కీపర్ సంజు శాంసన్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అలాగే రషీద్ ఖాన్ 6, 4 కొట్టిన తరువాత దేశ్ పాండే బౌలింగ్ లో జై స్వాల్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. రషీద్ ఖాన్ 4 బంతుల్లోనే 12 పరుగులు చేశాడు. తెవాటియా 12 బంతుల్లో 24 పరుగులు చేశాడు.  మరోవైపు తుషార్ దేశ్ పాండే 4 ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నాడు. మహీష్ తీక్షణ 54 పరుగులు సమర్పించుకున్నాడు. రాజస్థాన్ బౌలింగ్ విభాగం ఎక్కువగా వైడ్ బాల్ లు వేశారు. 17 వైడ్ బంతులతో సహా మొత్తం 18 ఎక్స్ ట్రాలు సమర్పించుకున్నారు. దీంతో గుజరాత్ టైటాన్స్ కి బాగా కలిసి వచ్చింది. మొత్తానికి గుజరాత్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మంచి ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఛేజ్ చేస్తుందో లేదో చూడాలి మరీ.

Related News

Haris Rauf: హ‌రీస్ ర‌ఫ్ ను ర్యాగింగ్ చేసిన ఫ్యాన్స్‌..కోహ్లీ, కోహ్లీ అంటూ

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

Big Stories

×