Andala Rakshasi: ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు రీ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇలా రీ రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్న నేపథ్యంలో ఎంతో మంది హీరోలు, దర్శక నిర్మాతలు తమ బ్లాక్ బస్టర్ సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇకపోతే త్వరలోనే మరో అద్భుతమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు తిరిగి విడుదల కానుంది. డైరెక్టర్ హను రాఘవ పూడి (Hanu Raghavapudi)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం అందాల రాక్షసి(Andala Rakshashi). ఈ సినిమా తిరిగి జూన్ 13వ తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
ప్రేమ కథ చిత్రం…
డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran), నవీన్ చంద్ర(Naveen Chandra), లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2012 ఆగస్టు 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఇలా థియేటర్లో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాని వెండి తెరపై చూడటానికి అభిమానులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా తిరిగి విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
జీవితాన్ని ఇచ్చిన సినిమా…
ఈ సందర్భంగా డైరెక్టర్ హను రాఘవపూడితో పాటు హీరోలు నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్ కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ ముగ్గురు ఈ సినిమాతో వారికి ఉన్న అనుబంధం గురించి, ఈ సినిమా వారి కెరియర్ కు ఏ విధంగా ఉపయోగపడిందనే విషయాల గురించి మాట్లాడారు. ఇక ఈ సందర్భంగా నటుడు రాహుల్ రవీందర్ మాట్లాడుతూ అందాల రాక్షసి సినిమా తన సినీ కెరియర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని తెలిపారు. ఈ సినిమా ద్వారా నటుడిగా నాకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమా లేకపోతే నాకు లైఫ్ లేదని తెలిపారు.
ఈ సినిమా నాకు అద్భుతమైన లైఫ్ ఇవ్వటమే కాకుండా వైఫ్ ని కూడా ఇచ్చింది అంటూ రాహుల్ రవీందర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. రాహుల్ రవీందర్ సింగర్ చిన్మయిని (Chinmayi) వివాహం చేసుకున్న విషయం తెలిసిందే వీరిద్దరిది ప్రేమ వివాహం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠికి సింగర్ చిన్మయి డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే రాహుల్ రవీందర్ కు చిన్మయి పరిచయం కావటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఈ దంపతులు ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఈ సినిమా ద్వారా చిన్మయి తన జీవితంలోకి వచ్చిందని ఈ సినిమా లేకపోతే తనకు చిన్మయి దొరికేది కాదు అంటూ రాహుల్ రవీంద్రన్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.