BigTV English

Akhil Zainab wedding: నాగార్జునకు ఏమైంది.. అఖిల్ పెళ్లి విషయంలో ఎందుకిలా?

Akhil Zainab wedding: నాగార్జునకు ఏమైంది.. అఖిల్ పెళ్లి విషయంలో ఎందుకిలా?

Akhil Zainab wedding: అక్కినేని నాగార్జున అమల దంపతుల చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni)తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పేసారు. ఈయన తన ప్రేయసి జైనాబ్(Zainab) తో కలిసి జూన్ ఆరో తేదీ ఏడడుగులు వేశారు. వీరి వివాహం జూబ్లీహిల్స్ లోని నాగార్జున(Nagarjuna) ఇంట్లో చాలా సింపుల్ గా జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇలా అఖిల్, జైనాబ్ వివాహపు వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరి పెళ్లి ఫోటోలను నాగార్జున అమల కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన కొడుకు పెళ్లి జరిగినందుకు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా మీ అందరి ఆశీర్వాదాలు వారికి ఉండాలని ఆకాంక్షించారు.


నాగార్జున పై విమర్శలు…

నాగార్జున తన వ్యక్తిగత కారణాలవల్ల ఈ వివాహాన్ని చాలా సింపుల్గా చేసినప్పటికీ జూన్ 8వ తేదీ వీరి వివాహ రిసెప్షన్ వేడుకను మాత్రం చాలా ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోలో అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఈ వివాహ రిసెప్షన్ కు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రమే కాకుండా, రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం అఖిల్ జైనాబ్ పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో కొంతమంది అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేయగా మరికొందరు మాత్రం సోషల్ మీడియా వేదికగా నాగార్జునపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.


జీలకర్ర , బెల్లం…..

నాగార్జున తన కొడుకు వివాహాన్ని సింపుల్గా చేయాలా? లేదా ఘనంగా చేయాలా? అనేది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయం. అయితే అఖిల్ వివాహాన్ని మాత్రం కనీసం సాంప్రదాయ పద్ధతులలో జరిపించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. జైనాబ్ ముస్లిం అమ్మాయి అయినప్పటికీ హిందూ సంప్రదాయ పద్ధతిలోనే తన మెడలో మూడు ముళ్ళు వేశారు. అయితే నుదుటిన బాసింగం లేకుండా, తలపై జీలక బెల్లం లేకుండా ఈ కార్యక్రమాన్ని ఏదో జరిపించాలంటే జరిపించారనే ఉద్దేశంతోనే నాగార్జున వీరి పెళ్లి చేశారు అంటూ విమర్శిస్తున్నారు.

ఇకపోతే గత ఏడాది డిసెంబర్ నెలలో నాగచైతన్య వివాహాన్ని కూడా నాగార్జున చేసిన సంగతి తెలిసిందే. ఇలా నాగచైతన్యకు శోభితకు అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా హిందూ సాంప్రదాయ పద్ధతి ప్రకారం పెళ్లి వేడుకలు నిర్వహించారు. నాగచైతన్యకు రెండో పెళ్లి అయినప్పటికీ హల్ది, మెహందీ వంటి కార్యక్రమాలను సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. కానీ అఖిల్ పెళ్లిలో ఇవేవీ కనిపించలేదని చెప్పాలి. ఇలా నాగచైతన్య వివాహానికి అఖిల్ వివాహానికి చాలా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో నాగార్జునపై విమర్శలు వెల్లు వెతుతున్నాయి. నాగార్జునకు అఖిల్ చిన్న కొడుకు కావడంతో తన వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారని అందరూ భావించారు కానీ అందుకు విరుద్ధంగా చాలా సింపుల్ గా జరిపించడమే కాకుండా కనీసం సాంప్రదాయాలను కూడా పాటించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×