Rahul Yadav Nakka: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఒక ప్రత్యేకమైన బ్యానర్ స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్. ఈ బ్యానర్ పైన రాహుల్ యాదవ్ నక్కా సినిమాలోని నిర్మిస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఈ బ్యానర్ లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు దేనికి అదే ప్రత్యేకమని చెప్పాలి. మళ్లీ రావా అనే సినిమాతో గౌతం తిన్ననూరి ఈ బ్యానర్ తోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత జెర్సీ లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను తెరకెక్కించాడు.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాతో నవీన్ పోలిశెట్టి ఇదే బ్యానర్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే బ్యానర్ నుంచి మసూద అనే ఒక సినిమా వచ్చింది. ఈ హర్రర్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే వరుస హిట్ సినిమాలు ఈ బ్యానర్ లో వచ్చాయి. ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఈ బ్యానర్లో రాబోతున్న సినిమా బ్రహ్మానందం.
పద్మశ్రీ బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్, ప్రియ వడ్లమని, రాజీవ్ కనకాల వంటి ఎంతోమంది ప్రముఖులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాకి ఆర్ వి ఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నాడు. శాండిల్య పీసపాటి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. బ్రహ్మానందం సినిమాకి క్రేజ్ అంతగా లేదని చెప్పాలి. రాహుల్ యాదవ్ సినిమా తీస్తున్నాడు అంటే గతంలో ఒక క్రేజ్ ఉండేది. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ వంశీ నందిపాటి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. గతంలో వంశీ నందిపాటి కిరణ్ అబ్బవరం నటించిన క, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో కనిపించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాడు.
క సినిమా కొద్దిపాటి లాభాలను తీసుకువచ్చినా కూడా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా ఊహించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమాతో నష్టపోయిన చాలా మంది ఎగ్జిబిటర్స్ కు బ్రహ్మానందం సినిమాను ఇస్తున్నాడు వంశీ నందిపాటి. ఇకపోతే ఈ సినిమా సరైన బజ్ క్రియేట్ చేయలేకపోయింది అనేది వాస్తవం. కేవలం రిలీజ్ కి అయిదు రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఈలోపు ఏదైనా ప్రత్యేకమైన ఈవెంట్ ప్లాన్ చేసిన ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. ఈ సినిమా నుంచి ఒక గ్లిమ్స్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ గ్లిమ్స్ లోని రాజా గౌతమ్ లోని ఒక కామెడీ టైమింగ్ మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. అలానే వెన్నెల కిషోర్ పాత్రకు కూడా మంచి స్కోప్ ఉండేలా అనిపిస్తుంది. అలానే ఈ వీడియోలో వినిపించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఫన్నీగా ఉంది. ఇంకా బ్రహ్మానందం గారి ఎంట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయిన టీజర్ మాత్రం అంతంత మాత్రమే ఉంది. ఈ సినిమా నుంచి ఇంకా ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఫిబ్రవరి 14న వాలెంటెన్స్ డే సందర్భంగా రిలీజ్ కానున్నాయి.
Also Read : Allu Arjun: తీరు మారలేదు, మళ్ళీ మళ్ళీ ఆర్మీ గోలే