Deadbody Robbery Fraud | ఒక పెద్ద హోటల్ వ్యాపారి బాగా ధనం సంపాదించేందుకు తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. భారీగా అప్పులు చేసి వ్యాపారం చేశాక.. నష్టాలు రావడంతో ఒక శవాన్ని దొంగలించాడు. అయితే పోలీసులు లోతుగా విచారణ చేయడంతో అతని బండారం బయటపడింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లాకు చెందిన దల్పత్ సింగ్ పర్మార్ అనే 40 ఏళ్ల వ్యక్తి రెండు నెలల క్రితం ఒక కారులో ప్రయాణిస్తుండా.. కారు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంతో కారు పూర్తిగా కాలిపోవడంతో కారులో ఒంటరిగా ఉన్న దల్పత్ సింగ్ చనిపోయారు. అతని శవం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని కారుని, అందులోని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత శవాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు.
కారు నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ ఆధారంగా దల్పత్ సింగ్ అడ్రస్ కనుగొని.. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దల్పత్ సింగ్ కుటుంబ సభ్యుల్లో అతని ఇద్దరు సోదరులు, అతని భార్య.. కారుని, అతని శవాన్ని గుర్తుపట్టారు. ఆ శవం దల్పత్ సింగ్‌దేనని ధృవీకరించారు. అయితే ఈ కేసుని విచారణ చేసే బనస్కంత పోలీస్ సూపరింటెండెంట్ అక్షయ్‌రాజ్ మక్వానాకు ఏదో అనుమానం కలిగింది. అందుకే శవం డిఎన్‌ఏతో దల్పత్ సింగ్ సోదరుల డిఎన్ఏ పోల్చి పరీక్షలు చేయించాడు. దీంతో అసలు నిజం బయటపడింది.
Also Read: సెలవు ఇవ్వలేదని ఆఫీసులో నలుగురిని కత్తితో పొడిచేశాడు.. వీడియో వైరల్
ఆ పోస్టుమార్టం రిపోర్ట్ లో ఆ శవానికి దల్పత్ సింగ్ సోదరులకు ఏ సంబంధం లేదని తేలింది. దీంతో పోలీసులు దల్పత్ సింగ్ సోదరులను అదుపులోకి తీసుకున్నారు. కారు దల్పత్ సింగ్ దే కాబట్టి.. ఆ కారులో ఎవరిదో శవం అక్కడికి ఎలా వచ్చింది? అసలు దల్పత్ సింగ్ ఎక్కడ అని పోలీసులు ప్రశ్నించారు. దీంతో దల్పత్ సింగ్ సోదరులు చెప్పిన నిజాన్ని విని అందరూ షాకైపోయారు.
బనస్కంత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అక్షయ్ రాజ్ ఈ కేసుని లోతుగా విచారణ చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. దల్పత్ సింగ్ ఒక హోటల్ వ్యాపారి గతంలో అతనికి ఒక పెద్ద హోటల్ ఉండేది. అయితే అది నష్టాలు రావడం కారణంగా విక్రియంచేశాడు. కానీ ఆ తరువాత కొత్త హోటల్ నిర్మాణం కోసం భారీగా అప్పులు తీసుకున్నాడు. ఈ క్రమంలో వడ్డీల భారానికి అతను ఆర్థికంగా కష్టాలు ఎదర్కోవాల్సి వచ్చింది. దాదాపు రూ.50 లక్షలకు పైగా అప్పులు అయిపోవడంతో వాటిని తీర్చలేక.. అప్పు ఇచ్చిన వారి మాటలు పడలేక.. ఒక ప్లాన్ వేశాడు. తాను చనిపోయే ఆ అప్పులు తిరిగి చెల్లించే బాధ ఉండదని తన సోదరులత చెప్పాడు. అందుకే ఒక ప్లాన్ వేశాడు. తన కారులో ఒక అనాథ శవాన్ని పెట్టేసి దాన్ని నిప్పంటించేసి కారు ప్రమాదంగా చిత్రీకరించాలి. ఆ తరువాత అతని కుటుంబ సభ్యులంతా కలిసి ఆ శవం దల్పత్ సింగ్ దేనని చెప్పాలి. దీంతో అతని పేరు మీద ఉన్న రూ.23 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు, కారు ప్రమాదం వలన రూ.1 కోటి వస్తాయని, అప్పులు కూడా తిరిగి చెల్లించాల్సి అవసరం లేదని పెద్ద ప్లాన్ వేశారు.
అందుకోసం ముందుగా శ్మశానానికి వెళ్లి అక్కడ పాతిపెట్టిన ఒక శవాన్ని వెలికితీశారు. ఆ శవం రమేష్ సోలంకి అనే వ్యక్తిది అని.. శవాన్ని కారులో పెట్టి.. కారు ఊరి బయటకు తీసుకెళ్లి.. ఒక లోయలో పడేశారు. ఆ తరువాత దాన్ని కాల్చారు. పోలీసులు దల్పత్ సింగ్, అతని ఇద్దరు సోదరులు కలిసి శ్మశానం నుంచి శవం వెలికితీసిన సిసిటీవి వీడియోని కూడా సాధించారు. ఈ ఆధారాలతో దల్పత్ సింగ్ సోదరులను అరెస్ట్ చేశారు. కానీ దల్పత్ సింగ్ మాత్రం పరారీలో ఉన్నాడు.