Raja Saab : టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాల తో ఫుల్ బిజీగా ఉన్నాడు. గత ఏడాది కల్కి మూవీతో మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూపర్ నేచురల్ అంశాలతో కూడిన రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని 2025 సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని చాలా రోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ డేట్ ను చాలా సినిమాలు కబ్జా చేశాయి. ఈ క్రమంలో సినిమా రిలీజ్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా వాయిదా పడితే బెస్ట్ అని ఫ్యాన్స్ అంటున్నారు. మరి మారుతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది..
‘రాజా సాబ్’ రిలీజ్ పై అనుమానాలు..?
కల్కి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఏప్రిల్ 10వ తేదీన ‘ది రాజా సాబ్’ సినిమా వస్తుందని ప్రకటించగా.. ఇప్పుడు అదే డేట్ కు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాని లాక్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ సినిమా రాదని క్లారిటీ వచ్చిన తర్వాతే మైత్రీ టీమ్ రిలీజ్ డేట్ ను ప్రకటించి ఉంటారనే కామెంట్లు కూడా వస్తున్నాయి.. అయితే రాజా సాబ్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. ఇక సిజీ వర్క్ పెండింగ్ ఉందని టాక్. మరి ఈ మూవీని అనుకున్న టైమ్ లో తీసుకురావడం కష్టం అని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
ప్రభాస్ తో పోటీ పడబోతున్న హీరోలు..
రాజా సాబ్ మూవీ రిలీజ్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద సంధిగ్ధం ఏర్పడింది. ఏప్రిల్ 10 కోసం వరుసగా స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. రీసెంట్ గా సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’ చిత్రాన్ని అదే రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. ఇప్పుడు అజిత్ మూవీ కూడా రేసులోకి వచ్చింది. ఇప్పటికైతే ఒకే తేదీకి మూడు సినిమాలు షెడ్యూల్ చేయబడ్డాయి. రానున్న రోజుల్లో వీటిల్లో మార్పులు ఉంటాయేమో చూడాలి.. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అజిత్ కుమార్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ మూవీ కూడా 270 కోట్లతో తెరకెక్కుతుంది. దాంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కల్కికి ఉన్న బజ్ రాజా సాబ్ కు లేదు. దాంతో సినిమాను పోస్ట్ పోన్ చెయ్యడమే మంచిదని మారుతికి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అందులో సినిమాకు ఇంకా వర్క్ చెయ్యాల్సి ఉంది. సో మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు ఊపందుకున్నాయి. మరి మారుతి వేరే డేట్ ను ఫిక్స్ చేస్తారేమో చూడాలి..