Redmi 14C 5G Smartphone: బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడంలో ముందు ఉండే షియోమీ సంస్థ.. మరో సూపర్ స్మార్ట్ 5G ఫోన్ ను విడుదల చేసింది. రెడ్‌మీ 14C 5G పేరుతో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ 50 MP కెమెరా, 5,160mAh బ్యాటరీతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఆకట్టుకుంటున్నది. దీని ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Redmi 14C స్పెసిఫికేషన్లు,ఫీచర్లు
రెడ్‌మీ 14C 5G స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వాటిలో ఒకటి 4GB + 64GB కాగా, మరొకటి 4GB + 128GB, ఇంకోటి 6GB + 128GB వేరియంట్ లో లభిస్తున్నది. రెడ్‌మీ 14C 5G స్మార్ట్ ఫోన్ రెడ్ మీ 13Cకి అప్ గ్రేడ్ వేరియంట్ గా అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.88 అంగుళాల HD+ డిస్ ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 600 నిట్స్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 Gen 2 చిప్ సెట్ తో వస్తున్నది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్ డ్ Xiaomi Hyper OSతో రన్ అవుతుంది.
50MP కెమెరా, 5,160mAh బ్యాటరీ
ఇక ఈ స్మార్ట్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. 2MP సెకండరీ కెమెరా సెన్సార్ తో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8MP ముందు కెమెరా ఉంటుంది. ఇక ఈ మోబైల్ 5,160mAh బ్యాటరీని కలిగి ఉంది. అంతేకాదు, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. బాక్స్ లో 33 W ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. ఇక IP52 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ తో అందుబాటులో ఉంటుంది. USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్ ఫోన్ జాక్ ను కలిగి ఉంటుంది. మంచి కెమెరా, చక్కటి బ్యాటరీ బ్యాకప్, ఆకట్టుకునే డిస్ ప్లే, లేటెస్ట్ చిప్ సెట్ ఈ ఫోన్ కు మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Redmi 14C ధర ఎంత? ఎక్కడ లభిస్తుందంటే?
Redmi 14C 5G ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 4GB ర్యామ్, 64 GB ఇన్ బిల్ట్ మెమరీ వేరియంట్ ధరను రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది. 4GB ర్యామ్, 128GB ఇన్ బిల్ట్ మెమరీ వేరియంట్ ధర రూ.10,999. 6 GB ర్యామ్, 128GB ఇన్ బిల్ట్ మెమరీ వేరియంట్ ధర రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ స్టార్ లైట్ బ్లూ, స్టార్ డస్ట్ పర్పుల్, స్ట్రాంగేజ్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది. జనవరి 10 నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కామ్, షావోమి రిటైల్ స్టోర్లలో ఈస్మార్ట్ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి కంపెనీ ఎలాంటి ఆఫర్లు ప్రకటించలేదు.
Read Also: రూ.10 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్లు ఇవే.. వెంటనే కొనేయండి బాస్!