BigTV English

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

SSMB29 : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు మరో సినిమాలో నటించబోతున్నాడు.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 29 వ సినిమాను చెయ్యబోతున్నాడు మహేష్.. ఈ సినిమా ను అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతుంది. కానీ ఇప్పటికి ఒక్క అప్డేట్ కూడా జక్కన్న ఇవ్వలేదు. దాంతో ఈ మూవీని మొదలు పెడతారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అయితే జక్కన్న మాత్రం అదిగో ఇదిగో అని ఊరిస్తూ వస్తున్నాడు.. కానీ సినిమా షూటింగ్ ను మాత్రం మొదలు పెట్టలేదు.. కాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ రాబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..


మహేష్ బాబుతో రాజమౌళి ఈ సినిమాను ప్రకటించి దాదాపు రెండేళ్లు పూర్తి కావొస్తున్న కూడా ప్రీ ప్రోడక్షన్ పనులు పూర్తి చెయ్యకపోవడం గమనార్హం.. స్క్రిప్ట్ కూడా ఇంకా పూర్తి కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మొన్న మహేష్ బర్త్ డే అప్డేట్ ను ఫ్యాన్స్ ఎక్సఫెక్ట్ చేశారు. కానీ రాజమౌళి మాత్రం మౌనంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వారందరికి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.. ఈ మూవీ 18వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్‌ తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనుందని టాలీవుడ్‌ టాక్‌. సినిమాకు తగ్గట్లుగా నటీనటులని వందల ఏళ్ల నాటి గిరిజన తెగ లుక్స్ తెచ్చేలా ప్లాన్‌ చేస్తున్నాడట రాజమౌళి..

Rajamouli coming in Mahesh Babu combination movie story leaked
Rajamouli coming in Mahesh Babu combination movie story leaked

ఇక ఈ మూవీ ని దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగా నే హాలీవుడ్ టెక్నీషియన్స్ ను బుక్‌ చేసినట్లు చెబుతున్నారు. మహేశ్‌ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను ఇంకా మొదలు పెట్టలేదు కానీ ఇలా అప్డేట్స్ ఇస్తూ ఊరిస్తున్నాడు జక్కన్న… ఇక ఈ మూవీ కోసం మహేష్ బాబు లుక్ ను పూర్తిగా మార్చేశాడు.. ఆ లుక్ కోసం ప్రిన్స్ బాగా కష్టపడ్డాడు.. ఇప్పటికే మహేష్ కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. త్రిపుల్ ఆర్ సినిమా లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమా పై అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.. పాన్ వరల్డ్ తెరకెక్కుతున్న ఈ సినిమా పలువురు హాలీవుడ్ స్టార్స్ కూడా నటించనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా ను కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.. త్వరలోనే సినిమా షూటింగ్ అప్డేట్ రాబోతుందని సమాచారం..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×