Black Spots: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ చర్మాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అంతే కాకుండా అమ్మాయిలు, అబ్బాయిలు అందంగా కనిపించాలని కోరుకుంటున్నారు. అందుకే వివిధ రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. ఇదిలా ఉంటే ముఖాన్ని తెల్లగా మెరిపించడానికి నల్ల మచ్చలు పోగొట్టడానికి కలబంద, రోజ్ వాటర్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ రెండూ చర్మ ఆరోగ్యాన్ని కాపాడే యాంటీఆక్సిడెంట్ , మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. నేడు పెరుగుతున్న కాలుష్యం , జీవనశైలి కారణంగా ముఖంపై మొటిమలు, మచ్చల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఈ రెండు మీ సమస్యను పరిష్కరిస్తాయి.
కలబంద, రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి ఉపయోగపడతాయి. చాలా మంది ముఖానికి రోజ్ వాటర్, కలబంద జెల్ వాడుతుంటారు. దీనివల్ల చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. క్రమం తప్పకుండా వీటిని ముఖానికి అప్లై చేస్తే.. చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. చర్మ సమస్యలు తొలగిపోతాయి.
కలబంద, రోజ్ వాటర్:
మీరు కలబంద, రోజ్ వాటర్ కలిపి మీ ముఖానికి అప్లై చేయవచ్చు. దీని కోసం రెండు చెంచాల కలబంద జెల్‌లో కాస్త రోజ్ వాటర్ కలపండి. తర్వాత దానిని మీ ముఖం మీద అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడుక్కోండి. ఇది ముఖం యొక్క కాంతిని పెంచుతుంది. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల చర్మం కూడా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇది మచ్చలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
కలబంద, రోజ్ వాటర్ ,గ్లిజరిన్:
కలబంద, రోజ్ వాటర్ లను గ్లిజరిన్ తో కలిపి కూడా అప్లై చేయవచ్చు. ఈ మూడు పదార్థాలు గొప్ప మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ముఖాన్ని అద్భుతమైన రీతిలో మాయిశ్చరైజ్ చేయడానికి పని చేస్తాయి. చర్మాన్ని మృదువుగా , ప్రకాశవంతంగా ఉంచుతాయి. సున్నితమైన చర్మం ఉన్నవారు ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే దీన్ని అప్లై చేయాలి.
కలబంద, రోజ్ వాటర్, శనగపిండి:
కలబంద, రోజ్ వాటర్ లను శనగపిండితో కలిపి కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. శనగపిండి చర్మానికి చాలా మంచిదని చెబుతుంటారు. ఎందుకంటే ఇది ముఖంపై సెబమ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. దీనివల్ల మొటిమలు, బ్లాక్ హెడ్స్ సమస్య కూడా తొలగిపోతుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాకుండా మచ్చలను కూడా తొలగిస్తుంది.
Also Read: ఫేస్ టోనర్ ఇలా తయారు చేసుకుని వాడితే.. రెట్టింపు అందం
కలబంద, రోజ్ వాటర్ ,గంధపు పొడి:
గంధపు పొడిని కలబంద , రోజ్ వాటర్ తో కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం చల్లబడుతుంది. ఇది మొటిమల ప్రభావాలను తగ్గిస్తుంది. అంతే కాకుండా మచ్చలు కూడా వెంటనే మాయమవుతాయి. మీరు రెండు చెంచాల అలోవెరా జెల్ లో రెండు చెంచాల గంధం, ఒక చెంచా రోజ్ వాటర్ కలపాలి. మీరు దీనిని వారానికి రెండుసార్లు కూడా ఉపయోగించవచ్చు. తరచుగా వీటిని వాడటం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. అంతే కాకుండా ముఖం తెల్లగా మెరిసిపోతుంది.