BigTV English

Rajasaab: కల్కి, సలార్ బాటలోనే రాజా సాబ్ కూడానా..?

Rajasaab: కల్కి, సలార్ బాటలోనే రాజా సాబ్ కూడానా..?

Rajasaab:ప్రభాస్(Prabhas).. ప్రస్తుతం ఈ పేరుకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే అలాంటి ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీ బిజీగా ఇండస్ట్రీలో గడుపుతున్నారు. కనీసం పెళ్లి చేసుకోవడానికి కూడా టైం లేకుండా ప్రభాస్ సినిమాలకే తన టైమ్ అంతా కేటాయిస్తున్నారు. అయితే ఇప్పటికే సీక్వెల్స్ మీద సీక్వెల్స్ చేస్తూ ప్రభాస్ బిజీగా ఉంటుంటే.. తాజాగా మరో సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుంది అంటూ సినీ ఇండస్ట్రీ వర్గాల నుండి ఒక టాక్ వినిపిస్తోంది. మరి ఇంతకీ ప్రభాస్ నటిస్తున్న ఏ సినిమాకు సీక్వెల్ ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం..


రాజా సాబ్ పై సరికొత్త రూమర్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫర్ ది ఫస్ట్ టైం కామెడీ హార్రర్ జోనర్ లో ఓ సినిమా చేస్తున్నారు. అదే ది రాజా సాబ్ (The Raja saab).. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా.. మాళవిక మోహనన్ (Malavika Mohanan) ,నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్, రిద్ధి కపూర్ (Riddhi Kapoor)హీరోయిన్ లుగా ఈ సినిమాలో చేస్తున్నారు. అలాగే ఈ మూవీలో నయనతార(Nayanthara) స్పెషల్ సాంగ్ చేయబోతుంది అని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంది అని కూడా అఫీషియల్ గా మూవీ యూనిట్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరొక క్రేజీ న్యూస్ టాలీవుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అదేంటంటే, ది రాజా సాబ్ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుంది అని పార్ట్ 2 కూడా సినిమా చివర్లో అనౌన్స్ చేస్తారంటూ ఫిలిం సర్కిల్స్ లో వినిపించడంతో చాలామంది షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే ది రాజా సాబ్ మూవీకి సంబంధించి సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటి వరకైతే అఫీషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేయలేదు.


రాజా సబ్ పార్ట్ 2.. నిజమేనా..?

కానీ సినీ వర్గాల్లో మాత్రం ది రాజా సాబ్ మూవీకి పార్ట్ -2 కూడా ఉంటుందని లీకులు అవ్వడంతో ఇది నిజమేనా.. లేక రూమరా అని కన్ఫ్యూజన్లో పడ్డారు ప్రభాస్ అభిమానులు. పుష్ప సీక్వెల్ గా వచ్చిన పుష్ప-2 సినిమాకి ఎలా అయితే చివర్లో పుష్ప-3 కూడా ఉంటుంది అని సుకుమార్ (Sukumar ) సడెన్ ట్విస్ట్ ఇచ్చారో.. ది రాజా సాబ్ మేకర్స్ కూడా సినిమా విడుదల చివర్లో దీనికి సీక్వెల్ ఉంటుంది అని అభిమానులకు ట్విస్ట్ ఇస్తారా అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ది రాజా సాబ్ మూవీకి నిజంగానే సీక్వెల్ ఉందా..? డైరెక్టర్ మారుతి (Maruthi)ది రాజా సాబ్ మూవీకి పార్ట్ -2 చేసే యోచనలో ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ వంటి రెండు సినిమాలలో వర్క్ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది చివర్లో స్పిరిట్ సినిమాలో కూడా జాయిన్ అవుతాడని తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాది కల్కి -2, సలార్ -2 సినిమా షూటింగ్స్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.ఏది ఏమైనప్పటికి ఇప్పటికే ది రాజా సాబ్ సీక్వెల్ గురించి వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ స్పందించాలని ప్రభాస్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×