HBD Sukumar : నిన్న మొన్నటి వరకు దేశవ్యాప్తంగా వినిపించినా ఒకే ఒక్క సినిమా పేరు ‘పుష్ప-2’.. ఏ ఇండస్ట్రీలో చూసినా పుష్ప -2 హవానే కొనసాగుతోంది.అయితే అలాంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ (Sukumar ) రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పవచ్చు. ‘ఆర్య’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్.. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలలో ఒకటి రెండు సినిమాలు మినహా .. మిగిలిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్సే. అయితే అలాంటి సుకుమార్ కి ఇండస్ట్రీలో ఉండే ఏ హీరో అంటే ఇష్టమో తెలిస్తే మీరందరూ నోరెళ్లబెడతారు. అవును సుకుమార్ కి ఇష్టమైన ఆ హీరోని ఎవరు ఊహించి కూడా ఉండరు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు.. ? సుకుమార్ ఆ హీరోనే ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చారా..? రూ.1900 కోట్ల సినిమా తీసిన ఆ డైరెక్టర్ కి ఇష్టమైన హీరో ఆయనేనా? అనేది ఇప్పుడు చూద్దాం..
సుకుమార్ ఫేవరెట్ హీరో ఆయనే..
పుష్ప-2 సినిమా తీసి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా చోటు సంపాదించుకున్న సుకుమార్ కి ఇష్టమైన హీరో ఎవరో కాదు ఒకప్పుడు యాంగ్రీ మాన్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్(Rajasekhar).. సీనియర్ నటుడు రాజశేఖర్ అంటే సుకుమార్ కి చాలా ఇష్టమట. అంతేకాదు ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమాల్లోకి వచ్చానని, ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సుకుమార్. ఇక చిన్నతనంలో ఉన్నప్పుడు రాజశేఖర్ సినిమాలు చూసి చాలా మురిసి పోయేవారట సుకుమార్. అలాగే స్కూల్ కి, కాలేజీకి వెళ్లిన సమయంలో రాజశేఖర్ ని ఇమిటేట్ చేస్తూ.. డైలాగులు, డాన్సులు చేసేవాడట. ఇక ఇది చూసిన ఆయన తోటి ఫ్రెండ్స్ చాలా బాగా చేశావురా.. వన్స్ మోర్ అని అడిగేవారట.ఆ టైంలో సుకుమార్ కి చాలా గర్వంగా అనిపించేదట.అలా తనకి సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరగడానికి కారణం రాజశేఖర్ అంటూ ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ చెప్పారు. ఇక రాజశేఖర్ నటించిన అంకుశం, ఆయుధం, ఆహుతి,మగాడు, ఆగ్రహం,తలంబ్రాలు వంటి సినిమాలు అంటే సుకుమార్ కి బాగా ఇష్టమట. అలా రాజశేఖర్ యాక్టింగ్ ని చూసి ఫిదా అయిన సుకుమార్ కి, సినిమాల్లోకి వచ్చాక ఏదైనా చేయగలుగుతాను అనే నమ్మకం ఏర్పడిందట.
సుకుమార్ సినీ ప్రస్థానం..
సుకుమార్ కెరియర్ విషయానికి వస్తే.. ఆయన ఆర్య మూవీతో తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టి, ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు.అలా సుకుమార్ ఖాతాలో ఆర్య, 100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప, పుష్ప -2 వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈయన దర్శకత్వం వహించిన జగడం,వన్ నేనొక్కడినే, ఆర్య -2 వంటి సినిమాలు నిరాశ పరిచాయి. ఇప్పుడు పుష్ప-2 సినిమాతో సుకుమార్ తన ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని వేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్లకు చేరువలో ఉంది.