AIIMS Guwahati Jobs: ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, పీహెచ్‌డీ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. గువాహటిలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
గువాహటి(అస్సాం)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 77
ఇందులో పలు రకాలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ప్రొఫెసర్-17
అడిషినల్ ప్రొఫెసర్-17
అసోసియేట్ ప్రొఫెసర్-18
అసిస్టెంట్ ప్రొఫెసర్-25
విభాగాలు: అనెస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్/డీఎం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతాలున్నాయి. నెలకు ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,68,900, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,48,200, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,38,300, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,01,500 వేతనం ఉంటుంది.
వయస్సు: 58 ఏళ్ల వయస్సు మించి ఉండరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 19
అఫీషియల్ వెబ్ సైట్: https://aiimsguwahati.ac.in
Also Read: Jobs in Bharat Electronics: భారీగా ఉద్యోగాలు.. డోంట్ మిస్.. జీతం ఏడాదికి రూ.13,00,000
అర్హత ఉన్నవారందరూ వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.