BIG TV Kissik Talk Show :బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘కిస్సిక్ టాక్ షో’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం జబర్దస్త్ వర్ష (Jabardast Varsha) ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉండగా.. పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నో తెలియని విషయాలను, వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేయగా.. ఇప్పుడు మరో సెలబ్రిటీ సందడి చేశారు. ముఖ్యంగా తమ వ్యక్తిగత జీవితంలో వచ్చిన అలజడుల గురించి చెప్పుకొచ్చారు..ఆ సెలబ్రిటీ ఎవరో కాదు రాజీవ్ కనకాల (Rajeev kanakala).
విడాకులపై స్పందించిన రాజీవ్ కనకాల..
ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న రాజీవ్ కనకాల.. ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అటు విలన్ గా, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా మెప్పిస్తున్న ఈయన.. తాజాగా ‘హోమ్ టౌన్’ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్ షో లో పాల్గొన్న రాజీవ్ కనకాల ఎన్నో విషయాలను పంచుకోగా.. అందులో భాగంగానే తన భార్య ప్రముఖ స్టార్ యాంకర్ సుమా కనకాల (Suma kanakala) గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. అంతేకాదు రాజీవ్ కనకాల- సుమా కనకాల విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వచ్చిన వార్తలపై కూడా స్పందించిన ఈయన తన భార్య మొండిది అంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ప్రస్తుత ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అవ్వగా.. ఈ ప్రోమో లోనే కొన్ని విషయాలను చూపించడం జరిగింది.
సుమా మొండిది – రాజీవ్ కనకాల
వర్ష మాట్లాడుతూ.. సుమా కనకాలకు , మీకు మధ్య విడాకులు అంటూ వచ్చిన వార్తలపై మీ స్పందన ఏమిటి? అనగా.. ఈ వార్తలు విని మేమే ఆశ్చర్యపోయాము. మా కొడుకు కూడా వచ్చి మమ్మల్ని నిలదీశారు. అప్పుడు మేమేం చెప్పాలో అర్థం కాలేదు. అసలు మా మధ్య ఎందుకు విడాకులు ఉంటాయి.. అంటూ తన భార్య పై తనకున్న ప్రేమను పంచుకున్నారు. మీ ఇద్దరిలో గొడవపడితే ఎవరు ముందుగా మాట్లాడతారని వర్షా ప్రశ్నించగా.. నేనే అంటూ కూడా చెప్పారు రాజీవ్ కనకాల..సుమా మొండిదని ఏదైనా గొడవ జరిగితే అంత త్వరగా మాట్లాడదని, ఇక నేనే ఏదైనా చిలిపి చేష్టలు చేస్తే అప్పుడు తాను కూల్ అవుతుంది అంటూ రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు..
ఎన్టీఆర్ చేసే పైనాపిల్ కర్రీ అంటే చాలా ఇష్టం..
అంతేకాదు ఇదే ప్రోమోలో ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి కూడా చెప్పుకొచ్చారు రాజీవ్ కనకాల.ఇకపోతే ఎన్టీఆర్ చేసే పైనాపిల్ కర్రీ అంటే తనకు చాలా ఇష్టమని, ఇది కనుక వీడియో తీసి యూట్యూబ్లో పెట్టామంటే ప్రతి ఇంట్లో కూడా అదే చేసుకొని తింటారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఇప్పుడు ఈ ప్రోమో చాలా వైరల్ గా మారింది.