Tenth Class Results: ఏపీలో పదో తరగతి పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఆన్సర్ పేపర్ల మూల్యాంకనం జస్ట్ ఏడు రోజుల్లో కంప్లీట్ చేసేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముల్యాంకన ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభించినున్నట్లు అధికారులు వెల్లడించారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 3100 మంది ఉపాధ్యాయులకు పేపర్ ముల్యాంకన విధులు అధికారులు కేటాయించారు. వీరు మొత్తం 3.20 లక్షల పేపర్లను దిద్దనున్నారు.
ALSO READ: RCF Ltd Recruitment: టెన్త్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే జీతం అక్షరాల రూ.46,300
గుంటూరు జిల్లాలో హాయెస్ట్ 1.8 లక్షల పేపర్లు ఉన్నాయి. వీటిని దిద్దేందుకు 1,268 మంది టీచర్లను అధికారులు కేటాయించారు. ఈసారి ఏపీ ప్రభుత్వం చాలా ముందస్తుగా ఫలితాలను విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్లు విద్యాశాక అధికారులు చెబుతున్నారు. అన్ని అనుకూలంగా ఉంటే ఈ నెల చివరిలోనే ఫలితాలు విడుదల చేసే అవకాశం కూడా ఉంది. అందుకోసమే ఎక్కువ మంది టీచర్లతో పేపర్లను దిద్దేందుకు విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పేపర్లను వీలైనంత త్వరగా ముల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను ప్రకటించాలని తగు ఏర్పాట్లు చేశారు.
గుంటూరు జిల్లా ఆన్సర్ పేపర్లను స్టాల్ బాలికల ఉన్నత పాఠశాలలో భద్రపరిచారు. మూల్యాంకనం అక్కడే జరిగేలా జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు కూడా చేసింది. రేపటి నుంచి ఈ నెల 9 వరకు ముూల్యాంకన ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రతి ఒక్క టీచర్ కు రోజుకీ 40 పేపర్లను ఇస్తారు. నిర్దేశిత వ్యవధిలోగా పేపర్లను దిద్దితే మరో 10 పేపర్లను ఎక్కువగా ఇస్తారు. పల్నాడు జిల్లాలో పేపర్ల మూల్యాంకనం కోసం ప్రధానోపాధ్యాయులతో పాటు కొన్ని పాఠశాలల్లో మొత్తం మిగిలిన టీచర్లను అందరినీ పంపుతుండడంతో.. అక్కడ 3 నుంచి 9 తరగతులు ఎవరు నిర్వహించాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్యలో టెన్త్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన 16,500 మంది పేపర్లను ఉమ్మడి గుంటూరులో టీచర్లు దిద్దనున్నారు.
ALSO READ: BEL Recruitment: బెల్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు, ఈ జాబ్ వస్తే రూ.90,000 జీతం.. ఇంకెందుకు ఆలస్యం..