Rajendra Prasad: విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) కెరియర్ ఆరంభంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..” సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు మా నాన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఫెయిల్ అయితే ఇంటికి రావద్దు అన్నారు. ఒక దశలో వేషాలు రాకపోవడంతో.. చేతిలో డబ్బులు లేక అవకాశాలు లేక మూడు నెలలు అన్నం తినలేదు. ఇక నాన్న కూడా ఇంటికి రావద్దు అన్నారు కదా అని ఆలోచించిన నేను, చివరికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ చివరిగా నిర్మాత పుండరీ కాక్షయ్య ఆఫీస్ కి వెళ్తే , అక్కడ డబ్బింగ్ అవకాశం వచ్చింది. దానితో నా దశ కూడా తిరిగిపోయింది” అంటూ తెలిపారు రాజేంద్రప్రసాద్. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
రాజేంద్రప్రసాద్ సినిమా తెరంగేట్రం..
రాజేంద్రప్రసాద్ 1977లో వచ్చిన ‘స్నేహం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత 1982లో వచ్చిన ‘మంచు పల్లకి’ సినిమాతో గుర్తింపు లభించింది. ఇక తర్వాత రెండు రెల్లు ఆరు, లేడీస్ టైలర్, అహనా పెళ్ళంట వంటి సినిమాలు ఈయనకు మంచి గుర్తింపును అందించాయి. ముఖ్యంగా చాలా సినిమాలలో కామెడీని పండిస్తూ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు రాజేంద్రప్రసాద్. అప్పుల అప్పారావు, ఎర్రమందారం, మాయలోడు, ఆ నలుగురు వంటి చిత్రాలకు ఏకంగా నంది అవార్డులను అందుకున్న ఈయన ఆంధ్ర యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ కూడా సొంతం చేసుకున్నారు. అంతేకాదు 2012లో మెడికల్ థ్రిల్లర్ డ్రీమ్ లో నటించిన ఈయనకు కెనడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో రాయల్ రీల్ అవార్డు కూడా లభించింది.
వ్యక్తిగత జీవితం..
ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. విజయ చాముండేశ్వరి (Vijaya Chamundeswari) ని వివాహం చేసుకున్నారు రాజేంద్రప్రసాద్. ఈమె ఎవరో కాదు ప్రముఖ సినీనటి రమప్రభ (Ramaprabha) మేనకోడలు మాత్రమే కాదు పెంపుడు కుమార్తె కూడా. రాజేంద్రప్రసాద్ వివాహం అనంతరం కుమార్తె గాయత్రి, కొడుకు కూడా ఉన్నారు. అయితే కుమార్తె గాయత్రి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో తండ్రి కూతుర్ల మధ్య మాటలు కూడా లేవనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇక గాయత్రి ఒక కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత న్యూట్రిషనిస్ట్ గా మారి తన కెరియర్ ను సాగిస్తూ ఉండేది. అయితే ఇటీవల అక్టోబర్ నెలలో గుండెపోటు వచ్చి ఆమె స్వర్గస్తులయ్యింది.
రాజేంద్రప్రసాద్ అందుకున్న అవార్డులు..
సినిమా అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఈయనకు ఆ తర్వాత అవకాశం లభించడంతో తనను తాను ప్రూవ్ చేసుకొని, ‘నటకిరీటి’గా బిరుదు అందుకున్నారు. అంతేకాదు నాలుగు సార్లు నంది అవార్డులు అందుకున్న ఈయన, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కూడా దక్కించుకున్నారు. అలాగే ఉత్తమ అత్యుత్తమ నటుడిగా సినిమా అవార్డు కూడా అందుకున్న ఈయన ఏకంగా మూడుసార్లు సంతోషం ఫిలిం అవార్డ్స్ సొంతం చేసుకున్నారు.