BigTV English

Rajinikanth: వరదల్లో చిక్కుకున్న సూపర్ స్టార్.. జలమయమైన ఇల్లు..!

Rajinikanth: వరదల్లో చిక్కుకున్న సూపర్ స్టార్.. జలమయమైన ఇల్లు..!

Rajinikanth.. ఎడ తెరపని వర్షాలు ప్రజల పనులకు ఆటంకాన్ని కలిగిస్తున్నాయి.. ముఖ్యంగా బయటకు రావాలంటే పెద్దలు, పిల్లలు భయపడుతున్నారు. దీనికి తోడు సీజనల్ వ్యాధులు.. ఇకపోతే అకాల వర్షాల కారణంగా ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర తో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాలలో పెద్ద మొత్తంలో వరద నీరు నిలిచిపోయింది. ఇప్పటికే పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేయగా… స్కూళ్ళకి, కాలేజీలకి కూడా సెలవు ప్రకటించాయి రాష్ట్ర ప్రభుత్వాలు.


జలమయమైన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇల్లు..

ఇదిలా ఉండగా వరద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కూడా వరదల్లో చిక్కుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నై ప్రాంతంలోని పోయిస్ గార్డెన్ పరిసర ప్రాంతాలలో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటి చుట్టూ భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ఇంట్లో ఎవరూ లేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా వస్తున్న డ్రైనేజీ సమస్యలు పరిష్కరించకపోవడం వల్లే ఇలా భారీ వర్షాలు , వరదలు వచ్చిన ప్రతిసారి కూడా ఆయన ఇంటిలోకి నీరు చేరుతోంది. ముఖ్యంగా పోయిస్ గార్డెన్ పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ వరద నీరు కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.


వరద సహాయక చర్యలు చేపట్టిన DCM..

వరద నీటి కారణంగా చెన్నై ప్రాంతంలో ఉంటున్న ప్రైవేట్ ఉద్యోగులకు దాదాపు మూడు రోజులపాటు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా దగ్గరుండి మరీ వరద సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇక రజనీకాంత్ సినిమాలు..

రజినీకాంత్ సినిమాల విషయానికొస్తే.. రజనీకాంత్ ఇటీవల వేట్టయాన్ అనే చిత్రంలో నటించారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో అక్టోబర్ 10 వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో మంజు వారియర్ హీరోయిన్గా నటించగా రితికా సింగ్ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంది. ఇక ఇందులో తెలుగు స్టార్ హీరో రానా దగ్గుబాటి, దుషారా విజయన్ , అమితాబ్ బచ్చన్ తదితర ప్రధాన తారాగణం భాగమయ్యారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరోవైపు లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు రజినీకాంత్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్, శృతిహాసన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్ , ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే జూలైలో హైదరాబాదులో ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ తో పాటు చెన్నైలో కొంత షెడ్యూలు ప్రారంభించారు. ఆ తర్వాత విశాఖపట్నంలో మరో షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇకపోతే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ప్రామాణిక అలాగే ఐమాక్స్ ఫార్మాట్ లలో విడుదల కాబోతున్నట్లు సమాచారం.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×