Jailer -2 Update : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఏడుపదుల వయసులో కూడా వరుస యాక్షన్ ఫిలిమ్స్ చేస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా ఇలాంటి చిత్రాలు చేయడం అంటే అంత ఆశామాషీ కాదు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తర్వాత ఆ స్టామినాను నిరూపిస్తూ.. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ఇక నటనకు వయసు అడ్డురాదు అంటూ నిరూపిస్తున్న రజినీకాంత్.ప్రస్తుతం ‘జైలర్ -2’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఈయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా ఏకంగా రూ.700 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh Ravichandran) ఈ సినిమాకు సంగీతం అందించారు. సినిమా మంచి విజయం సాధించడంతో అప్పుడే సీక్వెల్ కూడా ప్రకటించడం జరిగింది.
జైలర్ -2 నుండీ సాలిడ్ అప్డేట్..
ఇందులో భాగంగానే సినిమా టీజర్ ని కూడా విడుదల చేశారు. ఇకపోతే జైలర్ -1 లో రజనీకాంత్‌తో పాటు రమ్యకృష్ణ (Ramya Krishna), తమన్నా భాటియా (Tamannaah Bhatia), సునీల్ (Sunil), యోగిబాబు(Yogibabu), వసంత్ రవి (Vasanth Ravi) కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఇదే టీం తో ‘జైలర్ -2 ‘ కూడా తెరకెక్కబోతోంది. ఈ సినిమాని కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జైలర్ 2 కి సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ రోజు నుంచి రెండు వారాల షెడ్యూలు మొదలుకానున్నట్లు సమాచారం. ఈ రెండు వారాల షూటింగ్‌లో రజినీకాంత్ పైన పలు కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారట. దీని తర్వాత మరో షెడ్యూల్లో రజినీకాంత్ లేని సన్నివేశాలను ఆర్టిస్టులతో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్ట్ 1 లాగే ఇందులో కూడా చాలామంది స్టార్స్ కనిపించనున్నట్లు సమాచారం. ఇకపోతే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ :Home Town Teaser: యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ‘హోమ్ టౌన్’.. టీజర్ తోనే హైప్!
రజినీకాంత్ కెరియర్..
ఇక రజనీకాంత్ కెరియర్ విషయానికి వస్తే.. బస్ కండక్టర్గా తన కెరీర్ను ఆరంభించిన ఈయన, ఆ తర్వాత నాటక రంగంలోకి అడుగుపెట్టి, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ముఖ్యంగా సినిమాలో నటించేటప్పుడు ఎన్నో అవమానాలు, హేళనలు ఎదుర్కొన్న ఈయన..ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నారు. ఇక ఒక చిత్రం తర్వాత మరొక చిత్రంతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటూ తన స్టైల్ మేనరిజంతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన రజినీకాంత్ ఇప్పుడు సౌత్ సూపర్ స్టార్ గా చలామణి అవుతున్నారు. ఇక అంతే కాదు తన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంటున్న ఈయన ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్న విషయం తెలిసిందే.ఇప్పుడు జైలర్ 2 సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రజినీకాంత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.