Home Town Teaser..ఈ మధ్యకాలంలో కొంతమంది దర్శకులు ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకొని సినిమాలు రిలీజ్ చేస్తుంటే.. మరికొంతమంది మాస్, యాక్షన్, థ్రిల్లర్, సైకాలజికల్ చిత్రాలను ఇష్టపడే ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకొని సినిమాలు చేస్తున్నారు. ఇక మరి కొంతమంది యూత్ ని టార్గెట్ గా పెట్టుకొని సినిమాలు చేస్తూ.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇకపోతే అలా డైరెక్టర్ లు ఒక వర్గం ఆడియన్స్ ను టార్గెట్గా చేసుకొని సినిమాలు తెరకెక్కిస్తూ.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. అయితే సినిమా డైరెక్టర్లే కాదు ఇప్పుడు వెబ్ సిరీస్ లు నిర్మించే దర్శకులు కూడా ఇలాంటి తరహాలోనే ఆలోచన చేస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా పలు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఊహించని రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి.
హోమ్ టౌన్ అంటూ సరికొత్త వెబ్ సిరీస్..
ఈ క్రమంలోనే నిత్యం సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఓటీటీ సంస్థలలో ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీ సంస్థ కూడా ఒకటి. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైవిధ్యమైన కథాంశాలతో కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలను, షోలను, వెబ్ సిరీస్ లను అందిస్తూ ఆడియన్స్ కు మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘హోమ్ టౌన్’. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను శ్రీకాంత్ రెడ్డి పల్లె (Srikanth Reddy Palle) దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం సంయుక్తంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఝాన్సీ, రాజీవ్ కనకాల, ప్రజ్వల్ యాద్మ, జ్యోతి కీలక పాత్రల్లో నటించారు.
ఆకట్టుకుంటున్న హోమ్ టౌన్ టీజర్..
ఇక ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4వ తేదీ నుండి ఆహా తెలుగు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టిన చిత్ర బృందం.. తాజాగా టీజర్ ను విడుదల చేశారు. “కలలు ప్రారంభం అయ్యే ప్రాంతం.. మొదటి ప్రేమను అనుభవించే చోటు.. ఎప్పటికీ నిలిచిపోయే స్నేహం” అంటూ విడదీయరాని స్నేహాలు ,కుటుంబ విలువలు తెలిసేలా.. ఈ వెబ్ సిరీస్ ను నిర్మించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎప్పటిలాగే స్కూల్ విద్యార్థులను బేస్ చేసుకుని అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ముఖ్యంగా స్కూల్లో చదువు రాక.. మార్కులు రాక.. మార్కులు రాలేదని ఇంట్లో తెలిస్తే తిడతారనే భయంతో.. తెలియని మార్కులు వేసుకొని.. కనీసం వందకు ఎన్ని మార్కులు కూడా వేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో పేరెంట్స్ కి చిక్కిపోతే.. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది..లాంటి అంశాలను ఈ వెబ్ సిరీస్ లో చాలా చక్కగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇందులో ప్రసాద్ పాత్రలో రాజీవ్ కనకాల నటించారు. బిగ్ బాస్ ఫేమ్ అభినవ్ కూడా ఇందులో నటించడం జరిగింది. అంతేకాదు ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ లో ప్రియదర్శి కూతురిగా నటించిన బేబీ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఈ వెబ్ సిరీస్ లో భాగం అయింది. మొత్తానికైతే ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోబోతోందని నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.