BigTV English

BIG TV Kissik Talk Show: తారక్ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు… రాజీవ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేశాడు

BIG TV Kissik Talk Show: తారక్ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు… రాజీవ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేశాడు

BIG TV Kissik Talk Show:ఓటీటీ పుణ్యమా అని ఈరోజుల్లో వెబ్ సిరీస్ బాగా పాపులర్ అయ్యాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, వెబ్ సిరీస్ కి బాగా కనెక్ట్ అవుతున్నారు. తాజాగా ఈటీవీ విన్ లో ప్రసారమైన “90స్” వెబ్ సిరీస్ గా మన ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఆహా లో ప్రసారం అవుతున్న హోమ్ టౌన్ కు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. దీని ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ టీవీ కిస్సక్ టాక్ షో లో జబర్దస్త్ వర్షాతో రాజీవ్ ముచ్చటించారు. తన కెరియర్, వ్యక్తిగత విషయాల తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కు సంబందించిన కొన్ని సీక్రెట్స్ రీవీల్ చేశారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


తారక్ సీక్రెట్స్..

మీరు తారక్ మంచి ఫ్రెండ్స్ కదా.. ఆయన గురించి ఇప్పటివరకు ఎవరికీ చెప్పని సీక్రెట్ చెప్పండి అని వర్షా అడిగిన ప్రశ్నకు రాజీవ్ సమాధానం ఇస్తూ.. ” నేను తారక్ ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా నుంచి చాలా క్లోజ్. మాతో పాటు ఇంకో నలుగురు కూడా ఉన్నారు. అందరం అప్పుడప్పుడు కలుస్తుంటాము. తారక్ చాలా బాగా వంట చేస్తాడు. అందరం వాళ్ళ ఇంటికి వెళ్తే తనే వంట చేసి పెడతాడు. ఎంత మంది వెళ్లినా అందరికీ మటన్ బిర్యానీ, పైనాపిల్ కర్రీ, చేసి పెడతాడు. పైనాపిల్ కర్రీ అసలు మీరు ఎక్కడ చూసి ఉండరు. పైనాపిల్ కర్రీ మీకు కావాలంటే ఈసారి నేను తారక్ తో రిక్వెస్ట్ చేసి యూట్యూబ్లో ఆ రెసిపీ గురించి పెట్టమని చెప్తాను. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చేస్తాడు. ఒకప్పుడు బాగా తినేవాడు. ఇప్పుడు తగ్గించేశాడు. మేమంతా కలిసి భోజనం చేసేటప్పుడు తనకి ఇష్టమైన కర్రీని, హైదరాబాద్ బిర్యానీ, మాకు పెట్టకుండా తనే తినేవాడు. ఎప్పుడైతే డైట్ చేయడం మొదలుపెట్టాడో అప్పటినుండి మాకు వండి పెట్టడమే కానీ, తను తినడం చాలా తగ్గించేశాడు. మేము తింటుంటే చూసి సంతోషించేవాడు. ప్రతి ఒక్కరికి చక్కగా వండి పెట్టి ఎంజాయ్ చేసేవాడు” అని రాజీవ్ చెప్పాడు.


తారక్ ఫోన్లో రాజీవ్ పేరు..

మీ ఫోన్ లో తారక్ సార్ పేరు ఏమని సేవ్ చేసుకుంటారు అని వర్షా అడిగిన ప్రశ్నకి రాజీవ్ ఇలా చెప్పాడు .. ” అది నేను మీకు ఎలా చెప్తాను. చాలా సీక్రెట్, బయటికి చెప్పకూడదు. నా పేరు ని తారక్ తన ఫోన్ లో ఏమని సేవ్ చేసుకున్నారో నాకు తెలియదు” అని చెప్పారు . తారక్ తో తన స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ..” నన్ను ఎప్పుడు ఏడిపించడానికి రాజు అని పిలుస్తాడు. నాకు ఆ పేరుతో పిలవడం ఇష్టం ఉండదు. కానీ, తారక్ నన్ను అలానే పిలుస్తాడు. నేను చెప్పిన వినడు. నాకు కోపం వస్తుంది అని తెలిసిన నన్ను రాజు అనే పిలిచి ఏడిపిస్తూ ఉంటాడు” అని రాజీవ్ ఎవరికి తెలియని తారక్ సీక్రెట్ లని ఈ షో లో బయట పెట్టాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×