BigTV English

Priyanka Chopra: హాలీవుడ్ కి గుడ్ బై చెప్పనుందా.. వరుస టాలీవుడ్ చిత్రాలలో అవకాశం..!

Priyanka Chopra: హాలీవుడ్ కి గుడ్ బై చెప్పనుందా.. వరుస టాలీవుడ్ చిత్రాలలో అవకాశం..!

Priyanka Chopra..ప్రముఖ గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ గా కిరీటం అందుకున్న ఈమె ఆ తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే అక్కడ ఎదురైన కొన్ని పరిణామాల వల్ల తన రేంజ్ ను పెంచుకోవడానికి హాలీవుడ్ (Hollywood) కి వెళ్లిన ఈమె.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది. దీనికి తోడు అక్కడే హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ (Nick Jonas) ను ప్రేమించి మరీ వివాహం చేసుకొని, అక్కడే సెటిల్ అయిపోయింది. ఇక ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్గా పేరు దక్కించుకున్న ఈమె హాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత బాలీవుడ్ సినిమాలు చేయడం ఆపేసింది. దీనికి తోడు ఇండియాకి కూడా రాలేదని చెప్పాలి. కానీ చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు హాలీవుడ్ స్టార్ అయిన ప్రియాంక చోప్రాను రాజమౌళి (Rajamouli) ఇండియాకు తీసుకొచ్చారు.


రాజమౌళి కోసమే ఇండియాకి వచ్చిన ప్రియాంక చోప్రా..

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా చేస్తున్న ‘ఎస్ ఎస్ ఎన్ బి 29’ సినిమాలో ప్రియాంక చోప్రా ను రాజమౌళి హీరోయిన్గా తీసుకున్న విషయం తెలిసిందే. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రాజమౌళి స్థాయి కూడా హాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే పాన్ వరల్డ్ రేంజ్ అందుకున్న రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయడానికి స్టార్ సెలబ్రిటీలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక అందుకే ప్రియాంక చోప్రా ను తన సినిమాలో తీసుకోవడమే కాకుండా హాలీవుడ్ టెక్నీషియన్స్ ని కూడా తన సినిమా కోసం పనిచేసేలా పక్కా ప్లాన్ వేశారు రాజమౌళి. ముఖ్యంగా ప్రియాంకను ఈ సినిమాలో తీసుకోవడం వల్ల హాలీవుడ్ మార్కెట్ కి ఈమె బాగా ఉపయోగపడుతుందని ముందుగానే ఆలోచించి మరీ ఈమెను తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే ఇక్కడ రాజమౌళి తెలివితేటలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.


హాలీవుడ్ కి గుడ్ బై చెప్పనుందా..?

ఇకపోతే బాలీవుడ్ సినిమాలే చేయని ప్రియాంక చోప్రా.. రాజమౌళి సినిమాకి ఓకే చెప్పడమే కాకుండా ఇప్పుడు ఇండియాకి వచ్చి షూటింగ్లో కూడా పాల్గొనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు ప్రియాంక మరో తెలుగు సినిమాకి కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇటీవలే ‘పుష్ప2’ సినిమాతో ఊహించని విజయాన్ని అందుకొని, పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తో పాటు హాలీవుడ్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) తన తదుపరి ప్రాజెక్టును ప్రముఖ డైరెక్టర్ అట్లీ (Atlee ) దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఇందులో అల్లు అర్జున్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించబోతోందని సమాచారం. ముఖ్యంగా ప్రియాంక చోప్రా ఉన్న రేంజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నారట. దాంతో అటు ప్రియాంక చోప్రా కూడా విలువ ఉన్నచోటే తన విలువను మరింత రెట్టింపు చేసుకోవడానికి సిద్ధమైందని సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే.. బాలీవుడ్ నుంచే హాలీవుడ్ కి వెళ్లి ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ లో అవకాశాలు దూసుకుపోతున్న క్రమంలో ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి గుడ్ బై చెప్పబోతున్నట్లే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక దీనిపై పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది అని సమాచారం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×