NTR: నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది రోజుల్లోనే స్టార్ ఇమేజ్ ను అందుకోవడం మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు అతనికి అభిమానులుగా మారడమే కాకుండా ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది అంటూ యావత్ ఇండియన్ సినిమా అభిమానులంతా ఆయన సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రేంజ్ త్రిపుల్ ఆర్ తర్వాత పూర్తిగా మారింది.. ఆ తర్వాత ఆయన చేస్తున్న సినిమాలకు మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది.. అయితే ఆయన ప్రస్తుతం ఎలాంటి సినిమా చేస్తున్నాడు అనేది ఆసక్తిగా మారింది.. గత ఏడాది దేవర మూవీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో చేస్తున్న సినిమా పై అంచనాలు బాగా పెరిగాయి.
ఈ సినిమా కోసం ఆయన భారీగా సన్నబడ్డాడు. నిజానికి ఎన్టీఆర్ ఇంతకుముందు చాలా చెబ్బిగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఉన్న లుక్ ప్రశాంత్ నీల్ మూవీ కోసమే అని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ సోలో గా వచ్చిన మూవీ దేవర.. కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. కానీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగా బాగానే రాబట్టింది. ప్రస్తుతం సలార్ ఫెమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో ఎన్టీఆర్ లుక్ కొత్తగా ఉంటుందన్న విషయం ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది.
Also Read :ఆస్తి కోసమే నన్ను బలి చేశారు.. అయ్యో లచ్చవ్వ జీవితంలో కష్టాలు..?
రీసెంట్ గా మ్యాడ్ 2 సక్సెస్ మీట్ లో సందడి చేసిన ఎన్టీఆర్ చాలా వీక్ గా కనిపిస్తున్నాడు. అందుకు కారణం కూడా ఉందట. ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఎన్టీఆర్ ని ఒక 15 నిమిషాల పాటు డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడట. దానివల్లే అతను సన్నబడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ఆ షూట్ అయిపోయిన తర్వాత మళ్లీ తను యధావిధిగా తన బాడిని బిల్డ్ చేసుకుంటాడు అని చెబుతున్నారు.. ఎన్టీఆర్ ను అలా చూసిన ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇదేం లుక్ డైరెక్టర్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ ఇండియాలో చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.. ఇప్పటివరకు ఈయన తీసిన సినిమాలు అన్నీ బ్లాక్ బాస్టర్ హిట్స్ అయ్యాయి.. ఎన్టీఆర్ తో ఎలాంటి స్టోరీతో సినిమా చేస్తాడో అన్నది ఆసక్తిగా మారింది.. దీని తర్వాత ప్రభాస్ తో సలార్ 2 చేయబోతున్నాడు.. ఆ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.