Rakul Preet Singh ..చేతినిండా సినిమాలతో ఒకప్పుడు బిజీయెస్ట్ హీరోయిన్ గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తాజాగా బ్రేకప్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.. “నమ్మి విడిపోతే ఆ బాధ ఎంతో భయంకరం” అంటూ బ్రేకప్ గురించి రకుల్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘కెరటం’మూవీ ద్వారా వచ్చింది. అయితే ఈ సినిమా హిట్ కాలేదు. ఆ తర్వాత రెండు తమిళ సినిమాల్లో చేసినప్పటికీ అవి కూడా హిట్ కాలేదు. ఇక సందీప్ కిషన్( Sandeep Kishan) తో చేసిన ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేకుండా పోయింది.ఆ తర్వాత వరుస సినిమాలు చేసి సౌత్ స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది.
బ్రేకప్ పై తొలిసారి స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్..
కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా రాణించింది.తన యాక్టింగ్ తో హిందీ సినిమాల్లో సత్తా చాటింది. అలా బాలీవుడ్ లో మూవీస్ చేస్తున్న టైమ్ లోనే బాలీవుడ్ ప్రొడ్యూసర్ కం హీరో అయినటువంటి జాకీ భగ్నానీ (Jocky Bhagnani) తో ప్రేమలో పడింది. అలాగే గత ఏడాది రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీలు గ్రాండ్ గా పెళ్లి కూడా చేసుకున్నారు.ఇదంతా పక్కన పెడితే చాలా మంది నటీనటుల లైఫ్లో ప్రేమ, బ్రేకప్, పెళ్లి విడాకులు అనే అంశాలు ఉంటాయి. అలా రకుల్ ప్రీత్ సింగ్ లైఫ్ లో కూడా ఇలాంటి బ్రేకప్స్ ఉన్నట్లు ఆమె మాటల ద్వారా అర్థమవుతుంది.మరి ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్ బ్రేకప్ గురించి ఎందుకు అలా మాట్లాడింది..? ఏం మాట్లాడింది..? అనేది ఇప్పుడు చూద్దాం..
నమ్మి మోసపోవడం కంటే నరకం ఇంకోటి ఉండదు – రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “జీవితంలో అందరికీ ప్రేమ, బ్రేకప్ అనేవి ఉంటాయి. అయితే ఇవి నా జీవితంలో కూడా ఉన్నాయి. నేను ఈ బ్రేకప్ వల్ల ఎన్నో నేర్చుకున్నాను. కానీ ఎవరినైనా మనం బాగా నమ్మి ఆ తర్వాత ఆ వ్యక్తి నుండి విడిపోతే ఆ బాధ అంత భయంకరమైనది ఇంకొకటి ఉండదు. దాన్ని వర్ణించడానికి మాటలు కూడా ఉండవు. ముఖ్యంగా ఒకరిని గుడ్డిగా నమ్మి మోసపోయామే అనే గిల్టీ ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది. ప్రేమ అనేది చాలా గొప్పది.అలాగే మన లైఫ్ లో మనకి ఉన్న లోటు వేరే వాళ్ళు తీరుస్తారని ఎప్పుడూ కూడా నమ్మకం పెట్టుకోకూడదు.మన లైఫ్ లో ఉన్న లోటుని మనమే తీర్చుకోవాలి తప్ప.. వేరే వారిపై ఆశపడకూడదు. అయితే ఫస్ట్ టైం నేను జాకీ భగ్నానిని కలిసిన సమయంలో ఇదే విషయం చెప్పాను.మా ప్రేమ మొదలైనప్పటి నుండి ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. ఎవరి ఆలోచనలు, అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పాను. నా ఆలోచనా,అభిప్రాయాలు రెండూ నచ్చే జాకీ కూడా నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నారు. అలా మేమిద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యాం” అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.