Thieves Use Python| సాధారణంగా దొంగలు తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి, బంగారం, నగలు, డబ్బులు చోరీ చేస్తుంటారు. లేదా చైన్ స్నాచింగ్‌లు చేయడం, జేబులోని పర్సులు, మొబైల్ ఫోన్లు చలాకీ కొట్టేసే కేసుల గురించి మనం వింటూనే ఉంటాం. అయితే ఈ కాలంలో దొంగలు తెలివి మీరిపోతున్నారు. ఎవరూ ఊహించని కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తూ.. ఈజీగా చోరీలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన అమెరికాలో జరిగింది. అక్కడ టెన్నెస్సె రాష్ట్రంలో దొంగలు ఒక సూపర్ మార్కెట్ ని టార్గెట్ చేసి కొత్త ఐడియాతో లోపల ఖరీదైన సరుకు కొట్టేశారు.
వివరాల్లోకి వెళితే.. టెన్నెస్సె రాష్ట్రంలోని ఒక హై వే ప్రాంతంలో ఒక పెట్రోల్ పంప్ ఉంది. అందులో ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంది. అందులో భారత సంతతికి చెందిన మయూర్ రావల్ అనే యువకుడు క్యాషియర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం సూపర్ మార్కెట్లో మయూర్ ఒక్కడే ఉన్న సమయంలో లోపలికి ఇద్దరు యువకులు ఒక యువతి (ముగ్గురు దొంగలు) కస్టమర్లుగా ప్రవేశించారు. వారిలో ఒక యువకుడు లోపలకు వెళ్లి కావాల్సిన సరుకు షాపింగ్ ట్రాలీలో వేసుకుంటూ ఉండగా.. మయూర్ కు ఎందుకో అతని పై అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ ముగ్గురి బట్టలు చూస్తే వారు ఏదో రౌడీలుగా కనిపించారు.
Also Read: వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌లో ఇరుక్కున్న ఐరన్ వాషర్.. డాక్టర్లు చేయలేనిది ఫైర్ ఫైటర్స్ చేశారు!
దీంతో మయూర్ వారిని క్యాష్ కౌంటర్ వద్దకు రావాలని చెప్పాడు. కానీ లోపలున్న వ్యక్తి అతడి మాటలను పట్టించుకోలేదు. మరోవైపు మయూర్ తాను నిలబడి ఉన్న చోట నుంచి కదల్లేని పరిస్థితి.. ఎందుకంటే అక్కడ క్యాష్ కౌంటర్ ఉంది. అందుకే మయూర్ ముందుచూపుతో పోలీసులకు ఫోన్ చేయాలని భావించి.. టెలిఫోన్ తీసుకుందామని చేయి ముందుకు చాచగా.. వెంటనే అతని చేతి ఆ యువతి ఒక తెల్లని కొండచిలువ పాము (బాల్ పైథాన్)ని పెట్టేసింది. అది చూసి మయూర్ ఒక్కసారిగా భయపడిపోయాడు. అయితే కాసేపు తరువాత మయూర ధైర్యంతో ఆ పాముని పక్కనే ఉన్న కర్ర లాంటి వస్తువుతో పక్కకు తోసేసి మళ్లీ ఫోన్ అందుకోవాలని ప్రయత్నించగా.. అక్కడే నిలబడి ఉన్న మరో యువకుడు తన జేజులో నుంచి మరో ఎర్రని కొండచిలువ బయటికి తీసి మయూర్ ని బెదిరించాడు. ఆ యువతి కూడా అతడిని చంపేస్తామని బెదిరించింది.
మరోవైపు వెనుక నుంచి ట్రాలీ ఖరీదైన సిబిడి ఆయిల్ బాటిల్స్ ను ఆ మూడో యువకుడు దొంగలించి సూపర్ మార్కెట్ డోర్ బయట అడ్డంగా నిలబడి ఉన్న కారులోకి తీసుకెళ్లాడు. అప్పుడే మయూర్ బయట చూస్తే.. కారులో మరో యువకుడు ఉన్నారు. ఆ తరువాత మయూర్ పై ఆ దొంగలు పాములను విసిరేసి.. అక్కడి టెలిఫోన్ ని ధ్వంసం చేసి కారులో పరారయ్యారు. ఈ ఘటన తరువాత తేరుకొని మయూర్ ఎలాగోలా పోలీసులకు, సూపర్ మార్కెట్ యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.
పోలీసులు అక్కడికి చేరుకొని సిసిటివ వీడియోల ఆధారంగా ముగ్గురు దొంగలను గుర్తుపట్టారు. ఆ దొంగలు ఇంతకుముందు కూడా ఇలాంటి చోరీలు చేశారా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
Bizarre Heist Caught on CCTV! A group of suspects used two live ball pythons to distract a cashier before stealing $400 worth of CBD oil from a Citgo petrol station in Madison County. The footage, shared by 731 Crime Stoppers, shows a man placing the snakes on the counter while… pic.twitter.com/kX4ubXpGGi
— CLR.CUT (@clr_cut) March 17, 2025
ఇలాంటిదే ఒక షాకింగ్ దొంగతనం గతంలో ఢిల్లీ పరిసరాల్లో జరిగింది. ఈ ఘటనలో పెట్రోల్ చమురును దొంగిలించేందుకు ఒక దొంగ ఏకంగా సొరంగం తవ్వశాడు. ప్రముఖ పెట్రోలియం కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) పైపుల నుంచి ఆయిల్‌ను దొంగలించడానికి పోచన్‌పూర్‌కు చెందిన రాకేష్ అనే వ్యక్తి పెద్ద పథకం వేశాడు. ఢిల్లీ – పానిపట్ మధ్య ఉన్న ఇండియన్ ఆయిల్ పైప్‌లైన్ ప్రాంతానికి సొరంగం తవ్వి, ప్లాస్టిక్ పైపులు ఏర్పాటుచేసి పైప్‌లైన్‌లోని ఆయిల్‌ను తోడేయడం ప్రారంభించాడు.
అయిల్ సరఫరా తగ్గడంతో అనుమానం వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడ తవ్వకాలు జరిపినట్లు తెలిసి ఆశ్చర్యపోయారు. ఆయిల్ పైప్ లైన్ వద్ద డ్రిల్లింగ్ ద్వారా రంధ్రాలు చేసి, ప్లాస్టిక్ పైపులు పెట్టి ఆయిల్ దొంగతనం చేసేందుకు ఓ మిషన్ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. సొరంగం ద్వారా IOC పైప్‌లైన్‌కు 40 మీటర్ల దూరం వరకు పైపులు వేసినట్లు తేలింది.ఈ పైపులు 52 ఏళ్ల రాకేష్ అలియాస్ గోలు అనే వ్యక్తికి చెందిన పొలంలో ఉండటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.అయితే ఈ కేసులో అతడితో పాటు ఇతరులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. వారంతా పరారీలో ఉన్నారని వెల్లడించారు.