BigTV English

Ram Charan – Ntr : ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్, తారక్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..

Ram Charan – Ntr : ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్, తారక్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..

Ram Charan – Ntr : టాలీవుడ్ యంగ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ అనే మూవీతో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు.. రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. నిన్న ఆదివారం డల్లాస్ లో ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ కు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే ప్రేమ్ లో కనిపించారు. ఆ ఫొటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..


గేమ్ ఛేంజర్ టీమ్ తాజాగా వినూత్న ఆలోచన చేసింది. భారీ స్థాయిలో ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాబ్ చేసేందుకు ‘ఆర్ఆర్ఆర్’ జోడి రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి ఓ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు సంగీత దర్శకుడు తమన్ కూడా పాల్గొననున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఒకే ప్రేమ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ను ఇన్నాళ్లకు చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. మళ్లీ ఈ కాంబోను సినిమాలో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ కోరిక నేరవేరుతుందేమో చూడాలి.. ఇక చరణ్ గేమ్ చేంజర్ మూవీలో రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్‌, ‘జరగండి జరగండి.. ‘, ‘రా మచ్చా రా..’, ‘నా నా హైరానా’ సాంగ్స్‌కు, టీజర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. లార్జర్ దేన్ లైఫ్ సినిమాల ను తెరకెక్కించే డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గేమ్ చేంజర్’ మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా నుంచి రీసెంట్ గా దూప్ సాంగ్ వచ్చింది. ప్రస్తుతం అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక మూవీ తర్వాత ఉప్పెన ఫెమ్ డైరెక్టర్ బుచ్చి బాబు దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ మూవీలో దేవర బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వం లో మరో సినిమాను ప్రకటించారు. దీని గురించి త్వరలోనే అప్డేట్ రాబోతుందని సమాచారం. ఇక ఎన్టీఆర్ మూవీస్ విషయానికొస్తే.. ఇటీవలే దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ప్రస్తుతం హిందీలో హృతిక్ రోషన్ తోపాటుగా వార్ 2 మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ చెయ్యనున్నాడు.. వార్ 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం ఎన్టీఆర్ బిజీగా గడుపుతున్నారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×