BigTV English

Ram Charan : రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే స్పెష‌ల్.. అల్లూరి గెట‌ప్‌తో కామ‌న్ డిస్‌ప్లే పోస్ట‌ర్

Ram Charan  : రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే స్పెష‌ల్.. అల్లూరి గెట‌ప్‌తో కామ‌న్ డిస్‌ప్లే పోస్ట‌ర్
Ram Charan

Ram Charan : గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు మార్చి 27. ఆయ‌న పుట్టిన‌రోజు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఆయ‌న అభిమానులు అద్భుత‌మైన బ‌ర్త్ డే కామ‌న్ డిస్‌ప్లే పోస్ట‌ర్ (CDP,)ను విడుద‌ల చేశారు. ప్ర‌తి ఏడాది రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు అభిమానులు పండుగ‌లా సెల‌బ్రేట్ చేస్తుంటారు. ఈ ఏడాది ఈ సంబ‌రాలు మ‌రింత ఘనంగా జ‌ర‌గ‌బోతున్నాయి.


ఈ సంద‌ర్బంగా రామ్ చ‌ర‌ణ్ సోద‌రుడు వ‌రుణ్ తేజ్ కామ‌న్ డిస్ ప్లే పోస్ట‌ర్‌(CDP)ని విడుద‌ల చేయ‌టంపై ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు. అల్లూరి గెట‌ప్‌లో గంభీరంగా ఉన్న చ‌ర‌ణ్ లుక్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానుల‌ను అల‌రిస్తోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ‘గ్లోబల్ స్టార్.. మా అన్నయ్య CDPని విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంది. విన‌య విధేయ‌త‌లు, హార్డ్ వ‌ర్క్‌తో ఆయ‌న మాలో ఎప్పుడూ స్ఫూర్తినింపుతుంటారు. ల‌వ్ యు అన్న‌’’ అని అన్నారు.

ఈ ఏడాది రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు, ఆయ‌న అభిమానుల‌కు, స‌న్నిహితుల‌కు మ‌రింత ఎమోష‌న‌ల్ మూమెంట్స్‌ను ఇస్తుంద‌నే చెప్పాలి. ఎందుకంటే ఈ సూప‌ర్ టాలెంటెడ్ యాక్ట‌ర్ ఈ ఏడాది పాపులారిటీలో ఎవ‌రూ అంద‌నంత గొప్ప స్థానానికి చేరుకున్నారు. ఆదివారం (మార్చి 26)న మెగా ఫ్యాన్స్ అంద‌రూ క‌లిసి చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే ను ఘ‌నంగా సెల‌బ్రేట్ చేస్తున్నారు. ఈ వేడుక‌లు హైద‌రాబాద్‌లోని శిల్పాక‌ళా వేదికలో జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో మెగా హీరోలంద‌రూ పార్టిసిపేట్ చేస్తున్నారు.


RRRతో పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాలోని నాటు నాటు పాటకే ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఇందులో చరణ్ .. మన్యం వీరుడు అల్లూరి పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన శంకర్ దర్శకత్వంలో RC 15 సినిమా చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×