BigTV English

Big Tv Exclusive : RC16 షూటింగ్ కి అంతా సెట్… పూర్తి డీటైల్స్ ఇవే…

Big Tv Exclusive : RC16 షూటింగ్ కి అంతా సెట్… పూర్తి డీటైల్స్ ఇవే…

Ram Charan : టాలీవుడ్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిపుల్ ఆర్ తర్వాత వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు తో ఓ సినిమా చేస్తున్నాడు. RC16 తో సినిమా షూటింగ్ మొదలు పెట్టే పనిలో ఉన్నారు.. ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటి మెగా ఫ్యాన్స్ లో రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఈ సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చేసింది..


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో తమ హీరో ఎలా కనిపిస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ మూవీ స్టోరీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతుంది. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. నవంబర్ ఫస్ట్ నుంచి 8 వరకు మైసూర్ లో హీరో, హీరోయిన్ మీద మొదటి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు.. ఆ తర్వాత 12 నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలో తర్వాత షెడ్యూల్ షూటింగ్ ను చిత్రీకరించనున్నారు.. సంక్రాంతి వరకు అక్కడే సెకండ్ షెడ్యూల్ ను చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం..

ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. RC16 మూవీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ప్రముఖ మల్ల యోధుడి జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఆ మల్ల యోధుడి పేరు కోడి రామ్మూర్తి నాయుడు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం అనే గ్రామంలో 1882 పుట్టిన రామ్మూర్తి నాయుడు కుస్తీ పోటీల్లో తిరుగులేని ఆటగాడిగా పేరొందాడు. ఇతడి గురించి ఆంధ్రా ప్రజలు కథలు, కథలుగా చెప్పుకొంటారు.. ఈయన గురించి పెద్ద చరిత్రే ఉంది. కుస్తీ పోటీల్లో అతడికి తిరుగులేదు. ఎంతటి వాడినైనా మట్టి కలిపేసే వాడట.. ఆయన స్పీడ్ గా వచ్చే రెండు కార్లను ఒకేసారి తన రెండు చేతులతో ఆపేవాడని, ఆయన ఛాతిపై నాపరాళ్లను పెట్టుకుంటే.. అంతేకాదు ఒంటిచేత్తో రైలు ఇంజన్ ను రామ్మూర్తి నాయుడు ఆపినట్లు చెబుతుంటారు. ఈ సినిమా మొత్తం ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకేక్కించునున్నారు. ఈ మూవీలో పాత్ర కోసం బాడీని బిల్డ్ చేయడానికి చెర్రీ ఆస్ట్రేలియా వెళ్లినట్లు తెలుస్తోంది.. ఇప్పటికే రామ్ చరణ్ కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాలో ఎలా ఉంటాడో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×