BigTV English

Brahmamudi Serial Today October 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల వంశాన్ని సర్వనాశనం చేస్తానన్న అనామిక – నేనుండగా గడ్డిపోచ కూడా పీకలేవన్న కావ్య

Brahmamudi Serial Today October 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల వంశాన్ని సర్వనాశనం చేస్తానన్న అనామిక – నేనుండగా గడ్డిపోచ కూడా పీకలేవన్న కావ్య

Brahmamudi serial today Episode: కావ్య మీరు  చూసింది ఏదీ నిజం కాదు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదని చెప్తుంటే రాజ్‌ కోపంగా ఏది నిజం కాదు నా కళ్లతో నేను చూసింది నిజం కాదా? అంటూ ప్రశ్నిస్తాడు.  నీకు మాటకు మాట జవాబు చెప్పడమే తెలుసు అనుకున్నాను. మాటంటే పడటం అలవాటు లేదనుకున్నాను.  కానీ నీలో చాలా కళలు ఉన్నాయని ఇవాళే అర్థం అయింది కళావతి. నీ గెలుపును నాకు చూపించడానికి. నా ఓటమిని నువ్వు  చూడటానికి ఇక్కడికి వచ్చావని అర్థం అయింది అంటూ రాజ్ కోప్పడుతుంటే..


మీరు చూసింది ఏదీ నిజం కాదు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. అసలు ఏం జరిగిందో నన్ను చెప్పనివ్వండి అంటూ కావ్య ప్రాధేయపడుతుంది. అయినా వినకుండా రాజ్‌ ఏం చెప్తావు. నా కళ్లతో నేను చూశాను. ఇంకా నాకు మాయమాటలు చెప్తావా? నన్ను దెబ్బతీయాలన్న ఆలోచన నీకు కలిగిందంటే మా సంస్థకు ద్రోహం చేయాలని ఇంత చేశావంటే నువ్వు మా ఇంటి మహాలక్ష్మీవి  అని ఇంకా నమ్మే నా కుటుంబ సభ్యులను మర్చిపోయావంటే ఇది నీలోన నాకు కనబడ్డ కొత్త కోణం. అంటూ తిడుతుంటాడు.

అది నా వ్యక్తిత్వం కాదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను కలలో కూడా ఎవరికి ద్రోహం చేయాలనుకోను. నాకేం చెప్పాలో కూడా తెలియడం లేదు అంటుంది కావ్య. ఇంతలో రుద్రాణి కల్పించుకుని మా రాజ్ నిన్ను ఎంతలా నమ్మాడు. నీ అంతట నువ్వు వెళ్లిపోయినా నీ కోసం మా రాజ్‌ దిగివచ్చాడు. నిన్ను మళ్లీ కాపురానికి తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ ఇప్పుడు వాడి మనసును ముక్కలు చేశావు అంటూ తిడుతుంది. నువ్వు నా నమ్మకం మీద దెబ్బ కొట్టావు. జీవితంలో ఈ గుణపాఠం నేను మర్చిపోలేను. ఇంకెప్పుడూ నీ ముఖం నాకు  చూపించకు అంటూ రాజ్‌ వెళ్లిపోతాడు.


విన్నావుగా ఇక వాడు కానీ మా కుటుంబం కానీ నిన్ను జీవితంలో దగ్గరకు రానిచ్చేది లేదు అంటూ రుద్రాణి వెళ్ళిపోతుంది. కావ్య సుభాష్‌ కు ఏదో చెప్పబోతుంటే వద్దమ్మా ఇంకేం చెప్పకు నేను నీతో నా కొడుకులాగో రుద్రాణి లాగో మాట్లాడలేను. నువ్వేం చెప్పినా నాకు నమ్మాలనే ఉందమ్మా కానీ దేన్ని నమ్మాలి. నీ చేతిలో ఉన్న ఈ అవార్డునా..? వాళ్ల కోసం గెలిచిన నీ విజయాన్నా..? అంటూ సుభాష్‌ కూడా అక్కడి ఉంచి వెళ్లిపోతాడు. దీంతో కావ్య ఏడుస్తూ మెల్లగా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంటే అనామిక, సామంత్‌ వస్తారు.

అనామిక కంగ్రాచ్యులేషన్‌ కావ్య అంటూ చెప్పడంతో కావ్య కోపంగా దేనికీ మీరు బిగించిన ఉచ్చులో అమాయకంగా నేను చిక్కుకున్నందుకా..? ఎందుకు చెప్తు్న్నావు కంగ్రాచ్యులేషన్‌ అంటూ నిలదీస్తుంది. దీంతో ఇది ఉచ్చు కాదు కావ్య.  నీ టాంలెంట్‌కు తగిన గుర్తింపు.. అది మా సంస్థ కల్పించింది అంటుంది. దీంతో కావ్య  నేను నా కళను మీ కంపెనీకి అంకితం చేయలేదు. నా కాళ్ల మీద నిలబడటానికి ఉపయోగపడితే చాలు  అనుకున్నాను అంటుంది కావ్య. నువ్వు నీ కాళ్ల మీద నిలబడటం కాదు నీ భర్త ముందు ఎంత ఎత్తున్న  నిలబడ్డావో తెలుసా..? అంటుంది అనామిక.

అంత ఎత్తున్న నిలబడటం  కాదు పాతాళంలో పడ్డాను. ఇన్నాళ్లు ఎన్ని అభిప్రాయ బేధాలు ఉన్నా నేను  నా క్యారెక్టర్‌ ను వదులుకోలేదు. కానీ  ఇవాళ నన్నో  వ్యక్తిత్వం లేని దాన్ని చేశావు నువ్వు అంటూ కోప్పడుతుంది కావ్య.  నీ క్యారెక్టర్‌ నీకు ఏమిచ్చింది కావ్య.  ఆ ఇంట్లో నీకు విలువను ఇచ్చిందా..? ఆ కంపెనీలో నీకు గుర్తింపును  ఇచ్చిందా? అంటూ సామంత్‌ ప్రశ్నిస్తాడు. దీంతో కావ్య అందరూ అనామికలా ఉండరు మిస్టర్‌ సామంత్‌. నేను ఆ ఇంట్లో బంధాలకు విలువ ఇచ్చాను. అనామికలా  పతనం అయిపోవాలని అనుకోలేదు.

కాపురం కూల్చుకునే ఆడదానికి, ఆత్మగౌరవం కోసం బయటకు అడుగుపెట్టిన ఆడదానికి తేడా నీకేం తెలుస్తుందిలే.. అంటూ బదులిస్తుంది కావ్య. దీంతో అనామిక కోపంగా  ఈ నీతి సూత్రాలు  అన్నీ పట్టుకుని వేలాడుతూ నీ చావు నువ్వు చావు. నువ్వు మాతో చేతులు కలపపోయినా.. నీ అత్తారింటిని నేను భూస్థాపితం చేసి తీరతాను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది అనామిక. అవునా నేనుండగా ఆ ఇంటి ముందు  మొలచిన చిన్న గడ్డి పోచను కూడా నువ్వు ఏం చేయలేవు అంటూ రీ కౌంటర్‌ ఇస్తుంది కావ్య. దీంతో చూద్దాం ఎవరు ఏం చేస్తారో అని అనామిక అనడంతో చూద్దాంలే అంటూ కావ్య కూడా అంటుంది.

దుగ్గిరాల ఇంట్లో అపర్ణ, ఇందిరాదేవి, కావ్య ను సమర్థిస్తారు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. లేదంటే కావ్య అలాంటి పని చేయదు అంటూ కావ్యను వెనకేసుకొస్తారు. దీంతో రాజ్‌ నా కళ్లతో నేను  ప్రత్యక్షంగా చూశాను. మీరు కూడా చూశారుగా అయినా ఇంకా నమ్మడం లేదా? అంటూ కావ్యను తిడతాడు. రుద్రాణి కూడా ఆ కావ్య, అనామికతో చేతులు కలపి మన కంపెనీని దెబ్బకొట్టారు. అంటూ తిడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×