BigTV English

Ram Charan: హమ్మయ్య.. గేమ్ ఛేంజర్ పని పూర్తయ్యింది..

Ram Charan: హమ్మయ్య.. గేమ్ ఛేంజర్ పని పూర్తయ్యింది..

Ram Charan: ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


శంకర్ సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెల్సిందే. దాదాపు మూడేళ్ళుగా ఈ సినిమాను శంకర్ చెక్కుతున్నాడు. ఈ సినిమాను మొదలుపెట్టిన కొన్ని రోజులకే శంకర్.. భారతీయుడు 2 సమస్యల నుంచి బయటపడింది. దీంతో గేమ్ ఛేంజర్ ను వదిలి.. భారతీయుడు 2 ను ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. అందుకే ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ ఆలస్యమవుతూ వచ్చింది.

ఇక ఈ నెల లోనే భారతీయుడు 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. దీంతో శంకర్ ఫోకస్ అంతా గేమ్ ఛేంజర్ మీదనే పెట్టనున్నాడని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం నేటితో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్.. రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ రెదను పాత్రలకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యిందంట. ఎట్టకేలకు శంకర్.. మూడేళ్ళ తరువాత చరణ్ ను వదిలేశాడు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా.. చరణ్ ఎప్పుడెప్పుడు RC16 లో అడుగుపెడతాడా.. ? అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఎట్టకేలకు ఇన్నాళ్లకు చరణ్ గేమ్ ఛేంజర్ పని పూర్తి చేశాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ చిత్రంతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×