Ram Charan..క్లీంకారా.. ఒక్క రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన(Upasana ) దంపతులకు మాత్రమే కాదు మొత్తం మెగా ఫ్యామిలీకి లక్కీ డాటర్ అని చెప్పవచ్చు. క్లీంకారా ఎప్పుడైతే మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిందో.. అప్పటి నుంచి వరుసగా ఆ కుటుంబానికి సంతోషాలే ఎదురవుతున్నాయి. ఈ చిన్నారి ఉపాసన కడుపులో ఉండగానే ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి లభించిన గౌరవం సందర్భంగా ఆస్కార్ రెడ్ కార్పెట్ వేదికపై తల్లి తోపాటే తన అదృష్టాన్ని కూడా అందరికీ తెలియజేసింది. ఇక భూమి మీదకు వచ్చిన తర్వాత తన తాతయ్య మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కి ‘పద్మవిభూషణ్’ అవార్డు లభించింది. తన తండ్రి రామ్ చరణ్ (Ram Charan) గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అటు తన బాబాయ్ మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) కూడా తాను ప్రేమించిన అమ్మాయి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తో ఏడడుగులు వేశారు. అంతేకాదు రాజకీయాలలో చక్రం తిప్పడానికి ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్న తన చిన్న తాతయ్య పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కూడా ఏకంగా ఆంధ్రప్రదేశ్ కే డిప్యూటీ సీఎం అయిపోయారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఒకరికి కాదు ఇద్దరికి కాదు.. కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో అదృష్టాన్ని తెచ్చిపెట్టింది ఈ చిన్నారి.
పాపే ప్రాణం – మెగా ఫ్యామిలీ..
అందుకే ఈమెను అల్లారు ముద్దుగా చూసుకుంటూ.. పాపే సర్వస్వంగా బ్రతుకుతున్నారు. అటు చిరంజీవి ఆయన సతీమణి సురేఖ కొణిదెల (Surekha Konidela). అటు రామ్ చరణ్ కూడా తన సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా సరే పాపతో గడపడానికి రెండు గంటల సమయాన్ని కేటాయిస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు పాప ఎప్పుడైతే తనను నాన్న అని పిలుస్తుందో అప్పుడు వెంటనే పాప ముఖాన్ని అందరికీ బహిర్గతం చేస్తానని కూడా చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఏదో లాగా పాప ముఖం బయట పడింది.. అందరూ చూశారు అది వేరే విషయం. కానీ స్వయంగా, అఫీషియల్ గా ప్రకటించే రోజు కోసం మెగా అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఉగాది సందర్భంగా నానమ్మతో కలిసి భక్తిలో మునిగిపోయిన క్లీoకారా..
తెలుగువారి నూతన సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అయిన ఉగాది పండుగ సందర్భంగా క్లీoకారా తన నానమ్మ సురేఖ, తల్లి ఉపాసనతో కలిసి పూజ మందిరంలో..భక్తిలో నిమగ్నమైన వీడియో తాజాగా ఉపాసన తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకుంది. అందులో పాపని చూసిన అందరూ క్లీంకారా అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా? ఎంత క్యూట్ గా ఉంది.. అప్పుడే తన నానమ్మతో కలిసి పూజ కూడా చేస్తోంది. తాతయ్యలాగే ఈ పాపకి కూడా భక్తి ఎక్కువే.. అంటూ క్లీంకారా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు అటు ఉపాసన, ఇటు రాంచరణ్ దంపతులపై కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే తల్లి ఉపాసన, నానమ్మ సురేఖ కొణిదెలతో కలిసి క్లీంకారా పూజ మందిరంలో ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ పాప చాలా క్యూట్ గా ఉండడంతో అధికారికంగా పాప ఫోటోని రివీల్ చేయండి అంటూ కూడా కోరుకుంటున్నారు అభిమానులు. మరి చూద్దాం క్లీన్ కారా ఎప్పుడూ తన తండ్రిని నాన్న అని పిలుస్తుందో.. ఎప్పుడు రాంచరణ్ తన పాపను అందరికీ చూపిస్తారో.
?utm_source=ig_web_copy_link