BigTV English

Gun Shot in US : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి

Gun Shot in US : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి


Gun Shot in US : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. తుపాకీ గర్జనకు ఇద్దరు బలయ్యారు. తాజాగా ఫ్లోరిడాలోని ఒక బార్ లో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగింది. మియామి-డేడ్ షాపింగ్ సెంటర్ లో జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. ఏడుగురు గాయపడ్డారు.

Also Read : అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ కీలక హెచ్చరికలు.. ఎందుకంటే..?


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిటీప్లేస్ డోరల్ లోని మార్టిని బార్ లో ఉన్న ఒక దాబా ప్రాంతంలో కస్టమర్ల మధ్య వివాదం తలెత్తడంతో.. సెక్యూరిటీ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. వారిలో ఒక వ్యక్తి ఆగ్రహంతో తన గన్ ను తీసి సెక్యూరిటీపై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది.. కాల్పులు జరిపిన వ్యక్తిపై కాల్పులు జరపడంతో.. అతను కూడా మరణించాడు. ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులతో పాటు ఒక పోలీస్ అధికారికి కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిని జాక్సన్ ట్రామ్, హెచ్ సీఏ కెండల్ రీజినల్ ట్రామా కు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×