Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న RC 16 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను.. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు మేకర్స్. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు.. ముందు నుంచి వినిపించినట్టుగా ‘పెద్ది’ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ లుక్.. మెగా ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా ఓ రేంజ్‌లో ఉందని చెప్పాలి. రా అండ్ రస్టిక్, రగ్డ్ లుక్‌లో పవర్ ఫుల్‌గా కనిపించాడు చరణ్. చేతిలో చుట్ట, పొడవైన జుట్టు, గుబురు గడ్డం లుక్‌లో మస్త్ ఉన్నాడు చెర్రీ. బుచ్చిబాబు ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడని వినిస్తున్నట్టుగానే.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్‌ను ఎలా అయితే.. చూడాలని కోరుకుంటున్నారో అలానే చూపించాడు బుచ్చిబాబు. రెండు పోస్టర్స్ రిలీజ్ చేయగా.. రెండింటిలోను రామ్ చరణ్ అదిరిపోయాడు. ఒక లుక్‌లో చుట్ట కాలుస్తూ.. ఇంకో లుక్‌లో క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఊరమాస్‌గా కనిపిస్తున్నాడు. ఈ లుక్స్‌కి సాలిడ్ రెస్పాన్స్ వస్తోది. ఇండియా వైడ్‌గా ట్రెండ్ అయ్యాయి. ఈ పోస్టర్‌తో.. మెగా మాస్ పెద్ది అంటూ.. రచ్చ చేస్తున్నారు అభిమానులు. కానీ ఇదే రేంజ్‌లో పెద్ది పై ట్రోలింగ్ విషయంలో సోషల్ మీడియా అన్‌ఫైర్‌లో ఉంది.
పెద్ది పై ట్రోలింగ్ ఎందుకు?
పెద్ది లుక్ మెగా ఫ్యాన్స్‌కు ఊరమాస్ ట్రీట్ ఇచ్చింది. కానీ యాంటీ ఫ్యాన్స్‌కు మాత్రం ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లుక్‌ను.. చరణ్ కాపీ చేశాడని అని అంటున్నారు. పెద్ది లుక్ యాజ్ టీజ్‌గా పుష్ప లుక్ మాదిరిగా కనిపిస్తుందనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. పుష్పరాజ్‌నే బుచ్చిబాబు పెద్ది చేశాడని అంటున్నారు. మరొక లుక్ ఆర్ఆర్ఆర్ గుర్తు చేసేలా ఉందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ జైలుకి వెళ్లినప్పుడు.. జుట్టు వదిలేసి కనిపిస్తాడు. ఇప్పుడు పెద్ది సెకండ్ లుక్ కూడా అలాగే. ఇదే కాదు.. ఈ లుక్ కేజీఎఫ్‌లో యష్‌లా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌పై చరణ్ ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్ కూడా రామ్ చరణ్ ‘రంగస్థలం’ నుంచి వచ్చిందని వాదిస్తున్నారు. మొత్తంగా.. పెద్ది ఫస్ట్ లుక్ పై కాస్త గట్టిగానే ట్రోలింగ్ జరుగుతోంది. ఈ విషయంలో బుచ్చిబాబుని రామ్ చరణ్ క్లాస్ పీకినట్టుగా ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. ఇక ఈ నెగిటివిటీ చెక్ పెట్టాలంటే.. ఇప్పుడు అర్జెంట్‌గా గ్లింప్స్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గ్లింప్స్ వస్తే.. చరణ్ లుక్, సినిమా కంటెంట్ పై ఓ క్లారిటీ రానుంది. మరి పెద్ది గ్లింప్స్ ఎక్కడి వరకు వచ్చింది?
పెద్ది గ్లింప్స్ ఆరోజే?
వాస్తవానికి చరణ్ బర్త్ డే నాడు పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అనుకున్న సమయానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించలేకపోయాడు. దీంతో.. ఫస్ట్ లుక్‌తో సరిపెట్టాల్సి వచ్చింది. కానీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ మాత్రం పెద్ది గ్లింప్స్ మామూలుగా లేదని.. ఒక్క షాట్ కోసం వెయ్యి సార్లు చూస్తారని.. రాబిన్ హుడ్ ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చాడు. దీంతో.. ఫస్ట్ లుక్ విషయంలో డిసప్పాయింట్ అయిన అభిమానులు.. అర్జెంట్‌గా పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయాల్సిందేనని వెయిట్ చేస్తున్నారు. ఉగాది పండగ సందర్భంగా ఈగ్లింప్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. రేపో మాపో మేకర్స్ నుంచి ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే.. పెద్ది రగ్గడ్ లుక్ కాబట్టి అలా అనిపించి ఉండొచ్చు కానీ, కంటెంట్ పరంగా మాత్రం సినిమా మామూలుగా ఉండదని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్.